పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజి ప్రజెంట్ థియేటర్లలో సందడి చేస్తుంది . ఇక ఈ మూవీ పై కన్నడలో కొత్త వివాదం నడుస్తోంది . ఓ జి మూవీ కు బెంగళూరులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్స్ కు ఏర్పాట్లు చేయగా కన్నడ సంఘాలు వచ్చి గొడవ చేయడం జరిగింది . దీంతో ఓ జి ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేశారు . అయితే కాంతారా వన్ కు టికెట్ రేట్లను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది . దీంతో ఊజీకి కన్నడలో ఎదురైనా వివాదాన్ని ఈ సందర్భంగా సినీ వర్గాలు గుర్తుచేశాయి .


ఆ గొడవపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించడం ప్రజెంట్ వైరల్ గా మారింది . బెంగళూరులో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ కాంతారా 1 ప్రోత్సాహాన్ని ఆపవద్దు . అక్కడ జరిగిన దాంతో ఇక్కడ నిర్ణయాలను పోల్చడం కరెక్ట్ కాదు . మన సినిమాలకు కర్ణాటకలో ప్రోత్సహాలు అందట్లేదని విషయంపై ఫిర్యాదులు వస్తున్నాయి . ఈ విషయంపై రెండు ఇండస్ట్రీలా ఫిలిం ఛాంపియర్లు కూర్చుని మాట్లాడుకోవడం మంచిది . సినీ పరిశ్రమ బాగా ఎదుగుతుంది . ఇటువంటి టైం లో సంకోచిత భావం ఉండరాదు . జాతీయ భావంతోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి .


ఆ పరిణామాలపై ఏపీ ప్రభుత్వంతో చర్చిద్దాం .. అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు . ప్రజెంట్ పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇక పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూసిన పలువురు.. " తన సినిమాకి ఎఫెక్ట్ అయిన మిగతా సినిమాలకి ఎఫెక్ట్ కాకూడదని ఆలోచించే పవన్ కళ్యాణ్ మనసును మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి . ఏదేమైనా పవర్ స్టార్ అనిపించుకున్నాడు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు .

మరింత సమాచారం తెలుసుకోండి: