
నెటిజన్ల అభిప్రాయం ప్రకారం, గతంలో పూర్తిగా తన సినిమాలపైనే దృష్టి పెట్టే రాజమౌళికి, ఇప్పటి రాజమౌళికి చాలా తేడా కనిపిస్తోందట. ఒకప్పుడు సినిమా తప్ప మరో ధ్యాస లేని ఆయన, ప్రస్తుతం తన వృత్తిపరమైన బాధ్యతలతో పాటు ఇతర పనులను కూడా చక్కబెడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి కేవలం సినిమా షూటింగ్‌కే పరిమితం కాకుండా, పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, ఒక స్కూటర్‌ను ప్రమోట్ చేస్తూ, మరోవైపు తన బ్లాక్‌బస్టర్ సినిమా 'బాహుబలి' ఎపిక్ రీ-రిలీజ్ పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆయన ఏ మాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారని స్పష్టమవుతోంది.
సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అత్యంత నాణ్యతను, పర్ఫెక్షన్‌ను కోరుకునే రాజమౌళి, ఏకకాలంలో ఇన్ని పనులను సమర్థవంతంగా ఎలా పూర్తి చేయగలుగుతున్నారని సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారీ బడ్జెట్ సినిమా తీస్తూనే, మరోవైపు ఇతర పనులను కూడా బ్యాలెన్స్ చేయడాన్ని చూసి, 'రాజమౌళి బహుముఖ ప్రజ్ఞాశాలి' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఈ బిజీ షెడ్యూల్‌ను ఎలా నిర్వహిస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ బిజీ షెడ్యూల్ మహేష్ బాబు సినిమా నాణ్యతపై ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా, మహేష్-రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళిలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.