
దీంతో సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. “రెబల్ స్టార్‌తో సాహో, పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమాలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లింక్ పెట్టబోతున్నారా?” అనే విషయాలు ఇప్పుడు హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాకు “బ్లడీ రోమియో” అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సెన్సేషన్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమా ఎవరు ఊహించాని బ్యూటీ ని సుజిత్ ఫిక్స్ చేశారు అంటూ తెలుస్తుంది. ఈ చిత్రం బ్లడీ రోమియో లో హీరోయిన్ గా సాయి పల్లవి నతీంచబోతుందట.
ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా చేయని రిస్కీ పని చేయబోతున్నారు సుజిత్ అంటూ తెగ పొగిడేస్తున్నారు జనాలు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యారు అంటూ ఫిలిం వర్గాలల్లో ఓ టాక్ బయటకి వచ్చింది. అందువలన నాని-సాయి పల్లవి కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుందన్న ఆనందం, ఇంకోవైపు స్టార్ డైరెక్టర్ సుజిత్- సాయి పల్లవి నటనకు ఇంప్రెస్ అయ్యారని అందుకే ఇలా ఛాన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు.ఒకవేళ ఇదే నిజమైతే, ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ముందే చెప్పేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఇదే విషయం హైలెట్‌గా చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి దీని పై సుజిత్ అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తాడు అనేది..??