అనిల్ రావిపూడి — పేరు వింటేనే మనకు ఒక స్మైల్ వస్తుంది, ఎందుకంటే ఆయన సినిమాలు ఎప్పుడూ ఫుల్ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా ఉంటాయి. ఆయన చేసే ప్రతి పని, ప్రతి డెసిషన్ కూడా పక్కా జనాల మైండ్‌సెట్‌కి దగ్గరగా ఉండేలా, వారి హృదయాలను తాకేలా ఉంటుంది. ఇలాంటి మాస్టర్ మైండ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అనిల్ రావిపూడి అలాంటి వారిలో అగ్రగామి. కామెడీని, ఎమోషన్‌ని, ఫ్యామిలీ టచ్‌ని, మస్స్ ఎలిమెంట్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో మిళితం చేయడం ఆయనకే సాధ్యం.


ఇప్పుడు ఈ ప్రతిభావంతుడైన డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తున్నారు. “మన శంకర్ వర ప్రసాద్” పేరుతో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా ప్రస్తుతం శరవేగంగా సెట్స్‌పై షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి హీరోగా మన మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్‌గా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ మాత్రమే కాదు, సినిమాకి ఉన్న టెక్నికల్ టీమ్, ప్రెజెంటేషన్ స్టైల్ అన్నీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన “మీసాల పిల్ల” అనే సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో సునామీలా ట్రెండ్ అవుతోంది. చిరంజీవి ఎనర్జీ, అనిల్ రావిపూడి మార్క్ మాస్ టచ్, మరియు మ్యూజిక్ మేజిక్ — ఈ మూడు కలిసినప్పుడు ఫలితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.



అయితే, ఈ సాంగ్ విషయంలో ఒక స్పెషల్ టచ్ ఇచ్చి అనిల్ రావిపూడి మళ్లీ తన టేస్ట్‌కి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఉదిత్ నారాయణ గారిని తీసుకువచ్చి ఈ పాట పాడించారు. ఈ డెసిషన్ చూసి ఇండస్ట్రీ మొత్తం “ఓల్డ్ ఇస్ గోల్డ్” అని అంటోంది. ఉదిత్ నారాయణ గారికి 90లలో మరియు 2000లలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన పాడిన పాటలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్స్ అవ్వడమే కాదు, ఇవాళ్టికీ మనమందరం వినగానే నోస్టాల్జియాలోకి వెళ్తాము.ముఖ్యంగా చిరంజీవి సినిమాలలో ఉదిత్ నారాయణ వాయిస్ అంటే ప్రత్యేకమైన మేజిక్ ఉంటుంది. “చూడాలని ఉంది” సినిమాలోని రామ చిలకమ్మ, “కైకలూరి కన్నెపిల్ల” వంటి పాటలు ఇవాళ్టికీ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం తర్వాత చిరంజీవికి అద్భుతమైన వాయిస్ ఇచ్చిన సింగర్ ఎవరు అంటే, చాలామంది ఏకకంఠంగా ఉదిత్ నారాయణ గారినే చెబుతారు.



అందుకే, ఆయనను మళ్లీ ఈ జనరేషన్‌కి పరిచయం చేస్తూ, చిరంజీవి సినిమాకి తీసుకురావడం అనిల్ రావిపూడి తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రేక్షకులు కూడా “ఇదే అనిల్ రావిపూడి స్టైల్… పాత జ్ఞాపకాలను కొత్తగా చూపించడంలో ఆయనకంటే బెటర్ ఎవరూ లేరు” అంటున్నారు.మొత్తం మీద, ఈ సినిమా మ్యూజిక్ నుండే సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి టైమింగ్, మ్యూజిక్ ఎంపిక, మరియు చిరంజీవి మ్యాజిక్ — ఈ మూడు కలిసినప్పుడు ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ అవుతారు. “ఓల్డ్ ఇస్ గోల్డ్… అనిల్ రావిపూడి లెజెండ్!” అంటూ ప్రశంసితున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: