విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ శుక్రవారం రోజు అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ ఇంట్లోనే రహస్యంగా జరిగినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు వీరి ఎంగేజ్మెంట్ పిక్ ఒక్కటి కూడా బయటికి రాకపోయినప్పటికీ అఫీషియల్ గా మాత్రం వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్టు అటు మెయిన్ మీడియా ఇటు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియా మెయిన్ మీడియా మొత్తం వీరి ఎంగేజ్మెంట్ వార్తలతో నిండిపోయినప్పటికీ ఈ జంట ఇప్పటివరకు కనీసం ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఫోటో షేర్ చేయకపోయినా చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు.ఇదంతా పక్కన పెడితే తాజాగా రష్మిక విజయ్ ల ఎంగేజ్మెంట్ వేళ రష్మిక మాజీ ప్రియుడు పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది.ఆ ముగ్గురికి స్పెషల్ గా థాంక్స్ అంటూ రక్షిత్ శెట్టి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మరి మాజీ ప్రియురాలి ఎంగేజ్మెంట్ వేళ రక్షిత్ శెట్టి పెట్టిన ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రష్మిక విజయ్ ల ఎంగేజ్మెంట్ వేళ రక్షిత్ శెట్టి పెట్టిన పోస్ట్ అంటే వీరికి థాంక్స్ చెప్పినట్టు పెట్టే పోస్ట్ అని చాలామంది అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే రక్షిత్ శెట్టి మాజీ ప్రియురాలి గురించి కాదు తన సినిమాకి సంబంధించిన అవార్డు గురించి పోస్ట్ పెట్టారు. 2021సంవత్సరానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ అవార్డుల్లో 2021 లో వచ్చి విమర్శల ప్రశంసలు సైతం అందుకున్న రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 7777 సినిమాకి ఏకంగా నాలుగు అవార్డులు వచ్చాయి. 

ఉత్తమ నటుడుగా, ఉత్తమ రెండో సినిమాగా, ఉత్తమ గేయ రచయితగా, ఉత్తమ ఎడిటర్ గా ఇలా నాలుగు విభాగాల్లో నాలుగు పురస్కారాలు ఈ సినిమాకి వచ్చాయి.ఇక ఈ విషయం తెలిసిన రక్షిత్  శెట్టి తన ఆనందాన్ని ఆగబట్టుకోలేక తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. చార్లీ 7777 సినిమాకి నాలుగు చలనచిత్ర అవార్డులు రావడం ఎంతో హ్యాపీగా ఉంది. ఈ విషయం వినగానే నా మనసు ఉప్పొంగుతుంది.ప్రేక్షకులకు, జ్యూరీకి, చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సినిమా డైరెక్టర్ కిరణ్ రాజ్ విజన్ కి..నాగార్జునకి..ఎడిటర్ ప్రతీక్ ఈ ముగ్గురికి స్పెషల్ గా థాంక్స్ చెబుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం రక్షిత్ శెట్టి పెట్టిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: