ఐశ్వర్య రాజేష్..ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది “భాగ్యం” అనే పాత్రే. సంక్రాంతి సందర్భంగా విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో ఆమె పోషించిన ఆ పాత్రను చూసిన ప్రతి ఒక్కరూ ఆమె నటనకు ఫిదా అయిపోయారు. సాధారణంగా ఒక హీరోయిన్ కి ఇంత బలమైన క్యారెక్టర్ రేర్ గా దక్కుతుంది, కానీ ఐశ్వర్య రాజేష్ ఆ ఛాన్స్ ను అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆమె కళ్లలోని భావాలు, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్ లో చూపిన నేచురల్ యాక్టింగ్ చూసి అభిమానులు ఒక్క మాటలో — “ఈ పాత్రకు మరెవరూ సూట్ కారు, ఐశ్వర్య రాజేష్ మాత్రమే పర్ఫెక్ట్” అని చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత ఆమె క్రేజ్ రెట్టింపు అయ్యి, సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆమె వైపు చూసేలా చేసింది. ఇప్పుడేమో, మరోసారి ఐశ్వర్య రాజేష్ గురించి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈసారి ఆమె ఓ తెలుగు సీనియర్ స్టార్ హీరో పక్కన నటించబోతోందట. ఆ హీరో ఎవరో కాదు — మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. బాలయ్య ప్రస్తుతం తన కొత్త సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. “అఖండ 2” సినిమాతో పాటు గోపీచంద్ మలినేని, బాబీ లాంటి టాప్ డైరెక్టర్స్ తో కూడా ఆయన ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. వీటిలో ఒక సినిమాలో ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.


బాలయ్య పక్కన నటించాలంటే హీరోయిన్లకు ప్రత్యేకమైన ప్రెజెన్స్ అవసరం — కేవలం గ్లామర్ సరిపోదు, కొంచెం ఘనంగా, ఒంటినిండా, ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ఆ రేంజ్ లో స్క్రీన్ మీద నిలబడగలిగే నటి అంటే ఐశ్వర్య రాజేష్ తప్ప మరెవరూ కాదు అని అభిమానులు అంటున్నారు. గతంలో నయనతార, శ్రియా వంటి హీరోయిన్లు బాలయ్యతో జోడీ కట్టారు. కానీ నయనతార ప్రస్తుతం రెమ్యూనరేషన్ పరంగా చాలా హై రేంజ్ లో ఉండటంతో, ఈసారి కొత్తగా కానీ ప్రతిభ ఉన్న నటి కావాలని మేకర్స్ భావించారట. అందుకే కంటెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చే, పాత్ర బలంగా ఉంటేనే అంగీకరించే ఐశ్వర్య రాజేష్ ను సంప్రదించారట.



వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, కథ విన్న వెంటనే ఐశ్వర్య రాజేష్సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. “పాత్రకు డెప్త్ ఉంటేనే నేను సినిమా చేస్తాను, కేవలం స్క్రీన్ టైమ్ కోసం కాదు” అనేది ఆమె నిబంధన. ఈ సారి కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ తోనే ఆమె బాలయ్య పక్కన కనిపించబోతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ ఓ బాంబులా పేలిపోయింది. “బాలయ్య – ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ అంటే ఫైర్ అండ్ క్లాస్ కలయిక” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే ఈ కాంబో చూడటానికి చాలా ఎగ్జైట్ అయి, “ఇది బ్లాక్‌బస్టర్ ఫిక్స్” అని ముందే సెలబ్రేట్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కంటెంట్ బేస్డ్ సినిమాలే.  ఇప్పుడు బాలయ్య లాంటి మాస్ స్టార్ తో కలిసి నటించబోతోంది అంటే అది ఆమె కెరీర్ లో మరో పెద్ద మైలురాయి అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటి నుంచే ఆకాశాన్ని తాకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: