దాదాపు మూడు సంవత్సరాల క్రితం కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొదట కన్నడ భాషలో విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేయడంతో ఈ మూవీ ని ఆ తర్వాత చాలా భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ చాలా భాషలలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇకపోతే తాజాగా రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ లో రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి.

దాదాపు ఇండియావ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఒకే ఒక ఏరియాలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఏకంగా 50 కోట్ల ధరకు కొనుగోలు చేశారు. ఇక ప్రస్తుతం ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఆశించిన రేంజ్ కలెక్షన్లు రావడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు ఓవర్సీస్ లో 2.7 మిలియన్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. టోటల్గా ఈ మూవీకి ఓవర్సీస్ లో 4 నుండి 5 మిలియన్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 7 మిలియన్ కలెక్షన్లను రాబట్టాలి. అది కాస్త కష్టం అయ్యే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: