నటి త్రిష ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నట్టు తమిళ మీడియా వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.చాలా రోజుల నుండి పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్న త్రిషకి ఇంట్లో వాళ్ళు షాక్ ఇచ్చారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెట్టడంతో చేసేదేమీ లేక త్రిష కూడా ఓకే చెప్పిందట. అలా త్రిష ఈసారి ప్రేమ పెళ్లి కాకుండా ఇంట్లో వాళ్ళు కుదిర్చిన సంబంధాన్ని చేసుకోవడానికి ఒప్పుకుందట. ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిష పెళ్లి చేసుకోబోయే వరుడికి సంబంధించిన డీటెయిల్స్ తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ త్రిషని పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా త్రిష కృష్ణన్ చండీగర్ కి సంబంధించిన కుర్రాడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 చండీగర్ లో పుట్టి పెరిగినప్పటికీ ఆయన కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడడంతో ప్రస్తుతం ఆ అబ్బాయి ఆస్ట్రేలియాలోని తన బిజినెస్ పనులు చూసుకుంటున్నారట. ఆస్ట్రేలియాలోని తన బిజినెస్ ని తాజాగా ఇండియాలో కూడా విస్తరించాడట. అలా తన బిజినెస్ పనుల్లో భాగంగా త్రిష కుటుంబంతో ఏర్పడిన సాన్నిహిత్యంతో ఆ అబ్బాయిని చూసి త్రిషకి మంచి జోడీ అని పేరెంట్స్ ఫిక్స్ అయ్యారట.ఈ నేపథ్యంలోనే త్రిష కూడా ఆ వ్యక్తితో పెళ్లి గురించి చెప్పగా త్రిష కూడా ఆ అబ్బాయిని ఓకే చేసినట్టు తెలుస్తోంది. త్రిష పెళ్లికి ఒప్పుకోవడంతో ఈ హీరోయిన్ పెళ్లి వార్తలు తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 అయితే ఇప్పటివరకు త్రిష పెళ్లికి సంబంధించి అధికారిక న్యూస్ రాకపోయినప్పటికీ రహస్యంగా ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనే టాక్ మాత్రం వినిపిస్తోంది. అయితే త్రిష పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ మరో విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే గతంలో కూడా త్రిష ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.కానీ వారి పెళ్లి కాకుండానే పెటాకులు అయ్యింది. మరి ఈ బిజినెస్ మెన్  తో అయినా త్రిష పెళ్లి జరుగుతుందా అని నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: