కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన పేరు ఏ విధంగా వినిపించిందో ఇప్పుడు రుక్మిణి వసంత్ పెరుగు ఆ విధంగా మారుమోగుతుంది . అతడు కన్నడ ఇటు తెలుగు హీరోనా సినిమాలలో అవకాశాలు కొట్టేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ  . 2019వ సంవత్సరంలోనే కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రుక్మిణి వసంత్ ఇప్పుడిప్పుడే తెలుగులో పాపులారిటీని దక్కించుకుంటుందని చెప్పుకోవచ్చు .


ఇక 2024 లో వచ్చిన అప్పుడు ఇప్పుడు అనే చిత్రంతో మెరిసిన ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో కాంతారా చాప్టర్ 1 చిత్రంతో పాపులారిటీని తన సొంతం చేసుకుంది . ఈ మూవీలో కనకావతి అనే బ్యూటిఫుల్ పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకుంది బ్యూటీ . ఎవరు ఊహించని రీతిలో విలన్ పాత్రలో అందరిని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ . అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కి మరో అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు ఉప్పుమంటున్నాయి . త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న మూవీలో ఈమె ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది .


ఇక ఈ వారమే ఈ మూవీ పూజా కార్యక్రమం ఉన్నట్లు సమాచారం . అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు . నయనతార మరియు త్రిష లాంటి వాళ్లను సంప్రదిస్తున్నారు మూవీ టీం . అయితే 64 సంవత్సరాల వయసున్న విక్టరీ వెంకటేష్ నటించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది . ఇది కూడా నెగిటివ్ పాత్ర అని టాక్ . కాంతారావు చాప్టర్ వన్ తరహా లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది . ఇక త్వరలోనే ఈ పాత్ర పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: