జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులలో రాజీవ్ కనకాల కూడా ఒకరు.. ఎన్టీఆర్ నటించిన ప్రతి ఒక్క సినిమాలో రాజీవ్ కనకాల కూడా ఉండేవారు.అలా అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో వీరి కాంబో ని మనం చూడొచ్చు.అయితే ఇప్పుడైతే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కావడంతో రాజీవ్ కనకాలని ఎన్టీఆర్ సినిమాల్లో దర్శకుడిగా ఎక్కువగా తీసుకోవడం లేదు. కానీ గతంలో వచ్చే చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కాంబో ఉండేది  అయితే తెర ముందే కాదు తెర వెనుక కూడా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.అయితే అలాంటి ఎన్టీఆర్ తన బామ్మర్ది పెళ్ళికి ఇండస్ట్రీ నుండి కొంతమందిని ఆహ్వానించారు.వారిలో రాజీవ్ కనకాల కూడా ఒకరు.

 అయితే రాజీవ్ కనకాల ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ పెళ్లికి హాజరైన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ అందరి ముందే రాజీవ్ కనకాలని తిట్టి పరువు తీశారు. మరి ఇంతకీ ఎన్టీఆర్ రాజీవ్ కనకాలని ఎందుకు తిట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.రాజీవ్ కనకాల తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ పెళ్లికి వెళ్ళిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రాజీవ్ కనకాల రావడంతోనే ఎన్టీఆర్ తో పాటు కొత్త జంటతో కలిసి ఓ ఫోటో దిగుతారు.. ఈ ఫోటో దిగిన తర్వాత మరొకరు ఫోటో దిగడానికి రావడంతో రాజీవ్ కనకాల పక్కకు జరుగుతారు. 

ఆ సమయంలో ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండి ఫోటో దిగి ఫోటో అయిపోవడంతోనే అదేంటి పక్కకి జరిగి పోయావ్..ఇక్కడే ఉండొచ్చు కదా అన్నట్లుగా కోపంగా మాట్లాడారు.అయితే దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాడంతో చాలామంది నెటిజన్స్ బామ్మర్ది పెళ్లిలో ఎన్టీఆర్ మాస్ వార్నింగ్ రాజీవ్ కనకాల చేసిన పనికి ఇచ్చి పడేసారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అలా ఫన్నీగా రాజీవ్ కనకాల ఎన్టీఆర్ ల మధ్య జరిగిన ఈ సంభాషణకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: