సాధారణంగా మనం ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడానికి ఎక్కువగా టూత్ పేస్ట్ ఉపయోగిస్తుంటాము.టూత్ పేస్ట్ లోని కోల్‌గేట్ బ్రాండ్ గురించి అందరూ విన్నాము. ఇది చాలా నమ్మకమైన బ్రాండ్ గా పేరు సంపాదించింది కానీ కొంతమంది కేటుగాళ్లు ఈ టూత్ పేస్టును కూడా నకిలీగా తయారు చేస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది. ప్రజలకు హాని కలిగించే నకిలీ ఉత్పత్తుల దందాను గుజరాత్ రాష్ట్రంలోని కచ్ అనే ప్రాంతంలో పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం బయటపడింది.



అసలు విషయంలోకి వెళ్తే రాపర్ తాలూకాలోని చిట్రోడ్ ప్రాంతంలో  ఉండే ఒక ఫ్యాక్టరీ పైన పోలీసులు మెరుపు దాడి చేయగా ఈ భారీ ఎత్తున  నకిలీ టూత్ పేస్ట్ కు సంబంధించి వ్యవహారం బయటపడింది. ఈ సందర్భంగా నిజమైన కోల్‌గేట్ కంపెనీని సంప్రదించిన పోలీసులకు షాకింగ్ ఘటన తెలిసింది. అసలు తమ కంపెనీ అక్కడ ఎలాంటి వాటిని ఏర్పాటు చేయలేదని తమకు వాటికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో వాటన్నిటినీ కూడా నకిలీవని తేల్చేశారు. నాణ్యత లేకుండా చాలా తక్కువ ధరకే వచ్చేటువంటి పదార్థాలతో తయారు చేస్తున్నారట.


వాటిని కోల్‌గేట్ ప్యాకింగ్ చేసి మరి అమ్ముతున్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ పేస్టులు అచ్చం కోల్‌గేట్ పేస్టుల ఉత్పత్తిలాగే మార్కెట్లోకి విక్రయిస్తున్నారట. అక్కడ రూ. 10 లక్షల రూపాయల విలువైన నకిలీ సరుకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పేస్ట్ బ్యాచ్లు, ప్యాకింగ్ మెటీరియల్స్ తో సహా ఉపయోగించిన పరికరాలను కూడా సీజ్ చేసినట్లు తెలియజేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నకిలీ పేస్టులను ఎక్కడెక్కడ విక్రయించారనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషయం విన్న ప్రజలు  టూత్ పేస్టులో కూడా ఇలాంటి దారుణమైన పనులు చేస్తున్నారా అంటూ చేసిన వారి మీద ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: