టాలీవుడ్‌లో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఎంపిక చేసుకున్న సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ బ్యానర్ నిర్మించిన 'డ్యూడ్' సినిమా ద్వారా నిర్మాతలు కళ్లు చెదిరే లాభాలను ఆర్జించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్‌కు 13 నుంచి 15 కోట్ల రూపాయల మధ్య పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.

ప్రదీప్ రంగనాథన్ గతంలో నటించిన 'లవ్ టుడే', 'డ్రాగన్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఆ విజయాల పరంపరే 'డ్యూడ్' సినిమాకు బాగా కలిసివచ్చినట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక మైత్రీ మూవీ మేకర్స్‌కు గతంలో 'రాబిన్ హుడ్' చిత్రం ద్వారా వచ్చిన నష్టాలన్నీ 'డ్యూడ్' సినిమాతో పూర్తిగా కవర్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే నిర్మాణ సంస్థకు ఏకంగా 40 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లుగా సినీ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ సినిమాకు 'హిట్' టాక్ వస్తే, సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తం మీద 'డ్యూడ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో, మైత్రీ సంస్థకు ఎంత లాభాన్ని తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.

 దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రాన్ని కేవలం 65 నుంచి 70 రోజుల్లోనే పూర్తి చేసి, అనుకున్న బడ్జెట్‌లోపే ప్రాజెక్ట్‌ను ముగించారని నిర్మాత వై. రవిశంకర్ స్వయంగా చెప్పడంతో, ఈ సినిమా మైత్రీ బ్యానర్‌కు ఒక "పర్ఫెక్ట్ ప్లానింగ్ మాస్టర్‌పీస్" గా నిలవబోతోందని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దీపావళికి విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ప్రదీప్ రంగనాథన్  ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: