ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ లు అనే సంబంధం లేకుండా బోల్డ్ సీన్స్ సైతం చాలా వాటిలో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సీన్లు చేసిన, సినిమాలలో నటించిన వేరేగా చూసేవారు. అయితే ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా బోల్డ్ సీన్స్ కామన్ గా మారిపోయింది. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మరి నిర్మాతలు, డైరెక్టర్స్ సైతం ఇలాంటి సీన్స్ అవసరం లేకుండా పెట్టేస్తున్నారు. ఇలాంటి విషయాలపైన తాజాగా బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.


స్వరా భాస్కర్ మాట్లాడుతూ సినిమాలలో తాను కూడా ఎన్నోసార్లు బోల్డ్ సీన్లలో నటించాను కాకపోతే అది సినిమాలలో మాత్రమే ఒక భాగం అంటూ తెలియజేసింది. నాకు తెలిసినంతవరకు అందరికీ శృం*రం పైన అవగాహన తెలియాలి , సినిమాలలో బోల్డ్ సీన్స్ చేస్తే తప్పుగా చూడవద్దు. అది కేవలం జీవన విధానంలో ఒక భాగంగా మాత్రమే చూడాలి అంటూ తెలిపింది. మన జీవితంలో ఇలాంటివి కామన్ అనే విధంగా అందరూ నేర్చుకోవాలి , అప్పుడు సినిమాలలో అలాంటివి చూసినా సరే మన మెదడు చెడుగా ఆలోచించదు అంటూ స్వరా భాస్కర్ కామెంట్స్ చేసింది.


స్వర భాస్కర్ గతంలో కూడా ది వెడ్డింగ్ అనే చిత్రంలో హస్త ప్రయోగం చేసుకునే సన్నివేశాలలో నటించడం కూడా ఒక సంచలనంగా మారింది. కానీ ఇప్పుడు తాజాగా ఇలాంటి బోల్డ్ సన్నివేశాల పైన బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్వరా భాస్కర్ సినిమాలలోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా రాణించింది. ఈమె చివరిగా 2022లో మీమాంస అనే చిత్రంలో నటించింది. మళ్లీ ఆ తర్వాత ఎటువంటి చిత్రంలో కనిపించలేదు స్వరా భాస్కర్. స్వరా భాస్కర్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇమే 2023లో ఫహద్ అహ్మద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: