ఏ రంగమైనా సరే — మనం చేసే పనిలో ఒక హద్దు ఉండాలి అని పెద్దవాళ్లు ఎప్పుడూ చెబుతుంటారు. “ఏదైనా హద్దులు మించి చేస్తే చివరికి నష్టమే!” అనే సామెత విన్నట్లే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపించడానికి ప్రయత్నిస్తే అది కొన్నిసార్లు ప్రతికూలంగా మారుతుంది. ఇప్పుడు అలాంటి సిట్యూయేషన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకే వచ్చిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ పుల్, క్రేజ్ అన్నీ వేరే స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రశాంత్ నీల్  ప్రాజెక్ట్  షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే మధ్యలో తన బావమరిది పెళ్లి వేడుకలలో పాల్గొనడం కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు. ఆ ఫ్యామిలీ ఈవెంట్స్‌లో తీసిన ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు “ఎన్టీఆర్ చాలా సన్నగా మారిపోయాడు”, “సినిమా కోసమే ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు” అంటూ విభిన్న కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు అయితే ఆయన లుక్ చూసి మరింత ఎక్సైటెడ్ అవుతుండగా, మరికొంతమంది మాత్రం “ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు?” అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇంతలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన “మురుగన్” సినిమా గురించిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కాంబినేషన్‌ ఇప్పటికే అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చినందున, అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం — ప్రశాంత్ నీల్ సినిమా షెడ్యూల్ చాలా సార్లు వాయిదా పడటమే కాకుండా, ఎన్టీఆర్ గాయపడి విశ్రాంతి తీసుకోవడం, తర్వాత బావమరిది పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన షూటింగ్ సమయాలు పూర్తిగా డిస్టర్బ్ అయ్యాయట. దీంతో నటీనటుల కాల్ షీట్స్ మిస్ అవడంతో ప్రాజెక్ట్ టైమ్‌లైన్ మొత్తం గందరగోళమైందని సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్, కొత్త షెడ్యూల్ ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మరోసారి ఎన్టీఆర్ డేట్‌లు అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదట. అంతేకాదు, ఈ సినిమా పూర్తి కావడానికి ముందు సర్టిఫికేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ షూట్‌ల వంటివి కూడా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టొచ్చని టాక్.

దీంతో సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తూ “ దీని వల్ల మురుగన్ సినిమా లేట్ అవుతుందా..?” అంటున్నారు.  “ఇది త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో పెద్ద షాక్ అవుతుందా?” అంటూ చర్చిస్తున్నారు. మరికొందరు అయితే “ఇలా ఎన్టీఆర్ డేట్‌లు వృధా అవుతున్నాయంటే, ప్రాజెక్ట్ వేరే హీరో దగ్గరికి వెళ్తుందేమో” అని కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ "మురుగన్" సినిమా చుట్టూ గట్టి గాలి వీచుతోంది. అభిమానులు మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు… “ఎన్టీఆర్ మాస్ కంబ్యాక్ చూడాలి, ఈ ప్రాజెక్ట్ ఆగిపోకూడదు!” అంతున్నారు . చూడాలి మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: