తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ హీరోలలో రవితేజ కూడా ఒకరు..ఈయన ఇండస్ట్రీలో మాస్, యాక్షన్, కామెడీ, లవ్ ఇలా ఏ క్యారెక్టర్ లో అయినా నటిస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ మెల్లిమెల్లిగా హీరోగా మారి సూపర్ స్టార్ అయ్యారు. ఆయన అభిమానులు మాస్ మహారాజా రవితేజ అని బిరుదు ఇచ్చారు.. అలాంటి రవితేజ కెరియర్ లో అద్భుతమైన హిట్ సాధించిన సినిమాల్లో కిక్ సినిమా ఒకటి.. ఈ చిత్రానికి ముందు రవితేజ కెరీర్ ఒకెత్తయితే, దీని తర్వాత మరో విధంగా తయారయ్యింది.. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం రవితేజ కెరియర్ లోనే నెంబర్ వన్  అని చెప్పవచ్చు.. అలాంటి ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా కథానాయికగా చేసింది. ఇందులో తమన్ మ్యూజిక్ మరింత హిట్ అయ్యేలా చేశాయని చెప్పవచ్చు.. 

ఈ సినిమాకి స్టోరీ రాసింది వక్కంతం వంశీ.. అలాంటి కిక్ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ప్రేక్షకులు చూడక మానరు. తప్పకుండా ఈ సినిమా చూసినంత సేపు కడుపుబ్బా నవ్వాల్సిందే. అలాంటి కిక్ సినిమాలో మొదట హీరోగా రవితేజను అనుకోలేదట మేకర్స్.. ప్రభాస్ ను ముందుగా సంప్రదించారట.. కానీ ప్రభాస్ కు అప్పటికే  బిజీ షెడ్యూల్ ఉండడంతో ఈ సినిమా చేయడం కుదరదని రిజెక్ట్ చేశారట.. ఆ తర్వాత ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించారట..

కానీ సురేందర్ రెడ్డి  ఎన్టీఆర్ కాంబోలో అశోక్ సినిమా వచ్చి పెద్దగా హిట్ కాకపోవడంతో కిక్ సినిమా కథను విని ఆయన వద్దని చెప్పారట.. అలా ఈ మూవీ చివరికి రవితేజ వద్దకు వచ్చింది. ఆయన ఈ కథ విని ఓకే చేసేసారు. ఇంకేముంది చకచకా షూటింగ్ పూర్తి చేసుకొని సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. ఆయన కెరియర్ కి ఒక ప్లస్ గా నిలిచిందని చెప్పవచ్చు.. ఇలా అనుకోకుండా వచ్చిన సినిమాలు ఒక్కోసారి అద్భుతమైన హిట్స్ సాధిస్తాయని రవితేజ కిక్ సినిమాను చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: