మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న “పెద్ది” సినిమా ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారింది .. ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు, ఈ సారి చరణ్‌తో భారీ స్థాయిలో మాస్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు .. గ్రామీణ నేపథ్యంతో, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలోకి చేరింది  ... ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లు అభిమానుల్లో అంచనాలను ఆకాశానికెత్తేశాయి .. .


తాజాగా ఈ సినిమా పై ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. స్టార్ దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా పనుల్లో భాగమైందని సమాచారం .. ఇప్పటికే సుకుమార్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. . అయితే, ఇప్పుడు ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనా దృష్టి పెట్టి, బుచ్చిబాబుతో కలిసి సాంకేతిక అంశాలను పర్యవేక్షిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ స్టైల్‌లో కథనానికి ప్రత్యేకమైన క్వాలిటీ, టేకింగ్‌ ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు .. .


అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఏఆర్ రెహమాన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ సిద్ధం చేశారు . .. రామ్ చరణ్ కెరీర్‌లో మొదటిసారి రెహమాన్ సంగీతం అందించడం విశేషం .  . సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ పరంగా కూడా “పెద్ది” అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది. వృద్ధి సినిమాస్ అధినేతలు ఈ ప్రాజెక్ట్‌పై భారీగా పెట్టుబడి పెట్టి, పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . .. ఈ ఏడాది సమ్మర్ లేదా దసరా సీజన్‌లో “పెద్ది” విడుదల అవుతుందని సమాచారం. రామ్ చరణ్ కొత్త అవతారంలో కనిపించబోతుండడంతో అభిమానులు ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: