సోషల్ మీడియాలో ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం బన్నీ నటిస్తున్న అట్లీ సినిమా గురించే. ఎప్పుడెప్పుడు ఈ ఇద్దరి కలయిక రాబోతుందా అని అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. చివరికి అల్లు అర్జున్ హీరోగా, సౌత్ ఇండియన్ సెన్సేషన్ అట్లీ దర్శకత్వంలో ఒక మ్యాస్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వచ్చేసింది. ఇది అధికారికంగా తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో ఊహాగానాలు, ఎగ్జైట్మెంట్ పీక్ స్థాయికి చేరాయి.బన్నీ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్‌పై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. “ఎప్పుడెప్పుడు బన్నీ–అట్లీ సినిమా రిలీజ్ అవుతుందా?”, “ఈ కాంబో ఏ రేంజ్‌లో ఫైర్ అవుతుందా?” అంటూ సోషల్ మీడియాలో ప్రతి రోజు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపై ప్రతి చిన్న అప్డేట్‌ కూడా వైరల్ అవుతోంది.


ఇక తాజాగా బయటకు వచ్చిన ఒక సెన్సేషనల్ అప్‌డేట్ మాత్రం అభిమానుల హైప్‌ను మరింత రెట్టింపు చేసింది. ఆ అప్డేట్ ప్రకారం — ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్, ప్రతిభావంతురాలైన హీరోయిన్ కీర్తి సురేష్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతుందట. ఆమె పాత్ర పరిమితమైన స్క్రీన్ టైమ్‌ ఉన్నా, ఇంపాక్ట్ మాత్రం అసాధారణంగా ఉండబోతుందని సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, కీర్తి సురేష్ పాత్ర ఈ సినిమాలోని ప్రధాన హీరోయిన్ కంటే కూడా ఎక్కువ హైలైట్ అవుతుందట. అంతేకాదు, దీపికా పదుకొనే లాంటి స్టార్ నటీమణులు చేసిన రోల్స్‌కి సమానంగా — లేదా వాటికంటే కూడా ప్రభావవంతంగా — ఈ పాత్ర రూపుదిద్దుకోబోతుందట.



ఇప్పటికే గతంలో వచ్చిన ‘కల్కి’ సినిమాలో కీర్తి సురేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అద్భుతమైన స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఆమె వాయిస్ ఓవర్ అదనపు గ్లో రాబట్టింది. అయితే ఈ సారి మాత్రం కీర్తి సురేష్ వాయిస్ మాత్రమే కాదు, స్వయంగా తెరపై కనిపించబోతున్నారు. సుమారు పది నిమిషాల నిడివి ఉన్నా, ఆమె పాత్రకు ఉన్న బరువు మాత్రం కథను మరో స్థాయికి తీసుకెళ్తుందట.సినిమా యూనిట్‌లోనూ, సోషల్ మీడియాలోనూ ఇప్పటికే ఈ వార్త చర్చనీయాంశమైంది. “ఇంత తెలివైన క్యాస్టింగ్ ఆలోచన అట్లీగారికే వస్తుంది” అంటూ కోలీవుడ్ జనాలు తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రతి సినిమాతో కొత్త కోణాలను చూపించగలిగే అట్లీ ఇప్పుడు బన్నీని కూడా కొత్తగా చూపించబోతున్నారని టాక్.



ఇలా అల్లు అర్జున్ ఎనర్జీకి, అట్లీ మాస్ టేకింగ్‌కి, కీర్తి సురేష్ ఎమోషనల్ ఇంటెన్సిటీ కలిస్తే — ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ బ్లాక్‌బస్టర్ అవుతుందో ఊహించడమే కష్టం. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటినుంచే కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: