టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలైతే వినిపించాయి. ముఖ్యంగా ఈ వార్తలని ఒకవైపు ఖండిస్తూనే మరొకవైపు ఇద్దరు కలసి అప్పుడప్పుడు పలు ప్రాంతాలను తిరుగుతున్నారు. దీంతో ఈ రూమర్స్ మరింత బలం చేకూర్చేలా చేస్తోంది. ముఖ్యంగా  నాగచైతన్య ,శోభిత వివాహమైన తర్వాత వీరిద్దరూ మరింత క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తరచూ ట్రిప్ లకు వెళ్లడం, రెస్టారెంట్లకు, పార్టీలకు వెళ్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.



ఇక సమంత మీద ఎన్నో రకాల ట్రోల్స్ రూమర్స్ వినిపించిన మాత్రం వాటిని అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా సమంత తన కొత్త బ్రాండ్ పెర్ఫ్యూమ్ లాంచింగ్ సందర్భంగా దిగిన ఫోటోలను కొన్నిటిని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా తన రూమర్  బాయ్ ఫ్రెండ్ కి (రాజ్ నిడుమోర్)  టైట్ హగ్ ఇచ్చినట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను చూసిన అభిమానులు వీరి రిలేషన్ ని కన్ఫర్మ్  చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.


సమంత డైరెక్ట్ గా చెప్పకుండానే ఇలా ఇన్ డైరెక్టుగా హింట్ ఇస్తోంది అంటూ  కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి త్వరలోనే అఫీషియల్ గా ఈ జంట ప్రకటిస్తుందేమో చూడాలి మరి. మరి రాజ్ నిడుమోరి భార్య ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి మరి. సమంత సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా శుభం అనే చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇదే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: