సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అనుష్క ఎంతోమంది హీరోలతో జతకట్టి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది. ఎంతమంది హీరోయిన్స్ వచ్చిన అనుష్క ప్లేసును మాత్రం రీప్లేస్ చేయలేకపోయారు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. ఒకానొక సమయంలో ఏ సినిమా చూసిన కూడా అనుష్కనే హీరోయిన్గా కనిపించేది. అయితే ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలు చాలా తగ్గించేసింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించిన అనుష్క ఆ తర్వాత ఏడాదికి ఒకటి రెండు సినిమాలలో మాత్రమే కనిపించేది.


గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న అనుష్క వివాహం గురించి మాత్రం పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క ఒక డాక్టర్ ను వివాహం చేసుకోబోతోందని గతంలో వార్తలు వినిపించాయి. అలాగే మరో స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటుందంటూ వినిపించగా,ఇప్పుడు తాజాగా అనుష్క ఈ ఏడాది కచ్చితంగా వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె వయసు 44 ఏళ్ల కావడం చేత కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేయడంతో  పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినిపిస్తున్నాయి.


అనుష్క కుటుంబానికి దగ్గర బంధువైన ఒక వ్యాపారవేత్తతో అనుష్క వివాహం చేసుకోబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం కూడా లభించిందని త్వరలోనే అనౌన్స్మెంట్ అఫీషియల్ గా చేసే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. చివరిగా అనుష్క నటించిన చిత్రం ఘాటి ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలుస్తోంది.  అలాగే మలయాళంలో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పిరియాడిక్ డ్రామా చిత్రం కథనార్ చిత్రంలో కూడా నటిస్తోంది. మరి పెళ్లి విషయంపై అనుష్క ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: