అవును, ఈ సీక్రెట్‌ను సంగీత దర్శకుడు కోటి తాజాగా రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ పాటను చిరంజీవి ఎంతగా ద్వేషించారంటే... "ఈ పాట సినిమాలో ఉంటే నేను నటించను" అన్న రేంజ్‌లో పూర్తిగా రిజెక్ట్ చేశారట!ఎడిటర్ మోహన్‌తో కలిసి ఆ పాటను రికార్డింగ్ చేసిన కోటి.. చిరంజీవి ఎలాగైనా ఒప్పుకుంటారని నమ్మకంతో టీమ్‌తో కలిసి ఉన్నారు. కానీ, చిరంజీవి స్పందిస్తూ.. "కోటి నీకు మంచి పేరు వస్తుంది, కానీ నేను చేయలేను ఈ పాటకు డ్యాన్స్" అని తేల్చి చెప్పారట. మెగాస్టార్ నుంచి అలాంటి చేదు అనుభవం ఎదురవడంతో కోటి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారట. ఇంతకుముందు ఏ పాట విషయంలోనూ చిరంజీవి అలా స్పందించకపోవడంతో... ఎందుకు నచ్చలేదని కోటికి బుర్ర పని చేయలేదట!
అయితే, ఎడిటర్ మోహన్ మాత్రం ఆ పాటను మార్చవద్దని, అది క్యాచీ నంబర్ అని కోటికి ధైర్యం చెప్పారట. ఆ తర్వాత రీ-వర్క్ చేసిన కోటి.. అప్పట్లో ప్రఖ్యాత 'మీడియా ఆర్స్ట్' రికార్డింగ్ థియేటర్‌లో రోజున్నర పాటు రికార్డింగ్ చేయించి, శ్రీధర్ అనే సౌండ్ ఇంజనీర్‌తో మిక్స్ చేయించారు. రీ-వర్క్ పూర్తయిన తర్వాత ఆ పాటను మోహన్ మళ్లీ చిరంజీవికి ఇచ్చారు. ఆ సమయంలో చెట్టు కింద కూర్చుని పాట వింటున్న చిరంజీవి.. లైట్‌గా కాళ్లు ఊపడం మొదలు పెట్టారట! అది చూసిన మోహన్, మెగాస్టార్‌కు పాట నచ్చిందని అర్థం చేసుకుని, వెంటనే కోటికి ఫోన్ చేసి చెప్పారట. అప్పుడే కోటి ఎంతో సంతోషంగా ఫీలయ్యారు. ఆ సినిమాతోనే లారెన్స్ కొరియోగ్రాఫర్‌గా చిరంజీవితో తొలి పాట చేసినట్లు కోటి గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ ముందు చూపు, ఆయన రిజెక్ట్ చేసిన పాట బ్లాక్ బస్టర్ కావడం.. సినిమా చరిత్రలో ఒక అరుదైన సంచలనం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి