కొన్ని సంవత్సరాల క్రితం కార్తీ హీరోగా తమన్నా హీరోయిన్గా లింగు సామి దర్శకత్వంలో ఆవారా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా కార్తీ , తమన్నా ఇద్దరికి కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఈ మూవీ లో మొదట తమన్నా ను కాకుండా మరో ముద్దుగుమ్మను హీరోయిన్గా అనుకున్నారట. ఆల్మోస్ట్ అంతా ఓకే అయ్యాక ఆ సినిమా నుండి ఆమెను తప్పించి తమన్నా ను తీసుకున్నారట. ఇంతకు ఆవారా సినిమాలో తమన్నా కంటే ముందు అనుకున్న ముద్దుగుమ్మ ఎవరు ..? ఎందుకు ఆమెను తీసేసి తమన్నాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

ఆవారా సినిమాకు సంబంధించిన స్టోరీ మొత్తం సెట్ అయ్యాక హీరోయిన్గా నయనతారను తీసుకోవాలి అని మూవీ బృందం అనుకుందట. ఇక అందులో భాగంగా ఆమెను కలిసి సినిమా కథను కూడా వివరించారట. ఆమె కూడా ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. ఇక ఆ తర్వాత సినిమా బడ్జెట్ను తగ్గించాలి అని అనుకున్నారట. ఇక అందులో భాగంగా నయనతారను కూడా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అని కోరాడట. దానికి నయనతార ఒప్పుకోకపోవడంతో తక్కువ బడ్జెట్లో సినిమాను రూపొందించాలి అనే ఉద్దేశంతో నయనతారను కాకుండా తమన్నాను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. అలా నయనతారను ఆవారా సినిమాలో మొదట హీరోయిన్గా తీసుకోవాలి అని అనుకున్న చివరకు తమన్నా ను ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: