మెగాస్టార్ చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వం లో కొంత కాలం క్రితం వాల్టేరు వీరయ్య అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే . శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిం ది . రవితేజమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు . ఈ మూవీ 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే చిరు , బాబీ కాంబో లో మరో మూవీ కూడా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ కి టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో 158 వ మూవీ గా తెరకెక్కనుండడంతో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇకపోతే చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల్లో నటిస్తున్నాడు అని , ఆయన వయస్సుకు తగ్గ పాత్రలలో , కాస్త డిఫరెంట్ కథాంశాలతో రూపొందే సినిమాలలో నటిస్తే బాగుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు.

చిరు తో బాబి దాదాపు చాలా డిఫరెంట్ కథాంశంతో రూపొందబోయే సినిమాను తెరకెక్కియ్యనున్నట్లు , ఆయన వయస్సుకు తగ్గ పాత్రలో నటించనున్నట్లు , అలాగే ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఉండే అవకాశాలు దాదాపు లేవు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా బాబి , చిరు కోసం అదిరిపోయే రేంజ్ డిఫరెంట్ కథను రెడీ చేశాడు అనే వార్తలు బయటకు రావడంతో మెగా అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: