అక్కినేని అమల చాలా రోజుల తర్వాత ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది.ఈ నేపథ్యంలోనే తన తల్లిదండ్రులు,బాల్యం ఇలా ఎన్నో విషయాలు పంచుకున్న అమల తన ఇద్దరు కొడుకుల గురించి కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.అమల నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. చైతు చాలా రెస్పాన్సిబిలిటీ తో ఉంటారు.నాన్న మాటకు అస్సలు ఎదురు చెప్పరు. ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలి..ఎక్కడ ఏ మాట మాట్లాడాలి అనేది చైతుకు పూర్తిగా తెలుసు. ఎంతో డిసిప్లేన్ గా ఉండడంతోపాటు చిన్న వయసులోనే జీవితం మీద ఓ క్లారిటీ కి వచ్చాడు. 

ఎక్కువగా కోపానికి రాడు. ఎవరిని అమర్యాదగా మాట్లాడడు.ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడడంతో పాటు దేనిపైన అయినా సరే ఒక స్టాండ్ తీసుకుంటాడు.కానీ అఖిల్ అలా కాదు. గోడమీద పిల్లి లాంటోడు. ఒక నిర్ణయం మీద ఉండడు. యంగ్ ఏజ్ కాబట్టి ప్రతి విషయంలో అయోమయ పడిపోతుంటాడు. ఒక నిర్ణయం మీద నిలబడి ఉండడు. ఇప్పుడే నిర్ణయం తీసుకుంటాడు .మళ్ళీ అటువైపు దూకేస్తాడు అలా గోడ మీద పిల్లిలా ఉంటాడు. అంటూ ఇద్దరు కొడుకుల్ని ఉద్దేశించి అమల ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అలాగే తన ఇద్దరు కోడళ్ల గురించి మాట్లాడుతూ.. శోభిత చాలా మెచ్యూర్డ్.. అలాగే డేరింగ్ పర్సన్..ఇక జైనా విషయానికి వస్తే..గుడ్ హార్ట్ చాలా క్యూట్..

నాకు ఇద్దరు మంచి కోడళ్లు దొరికారు.టైం దొరికితే చాలు వారితో కలిసి ఎక్కువగా గడుపుతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అక్కినేని అమల..అలాగే నేను మా అత్త మామల నుండి ఎంతో నేర్చుకున్నాను. అత్తయ్య నుండి కోడలుగా ఎన్నో విలువలు నేర్చుకున్నాను. నా నుండి నా కోడళ్లు ఇప్పుడే ఆ విలువలు నేర్చుకుంటున్నారు. అలాగే నాకు పూజలు పెద్దగా చేయడం రాదు. కానీ వేదాలు మాత్రం బాగా తెలుసు అంటూ అత్తమామల్ని తలుచుకుంటూ అమల కాస్త ఎమోషనల్ అయింది. ఇలా మొత్తంగా తన ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది అమల.

మరింత సమాచారం తెలుసుకోండి: