ఏంటి టిడిపి పార్టీ పేరు చెబితేనే అగ్గిమీద గుగ్గిలంలా లేచే వల్లభనేని వంశీ టిడిపి పార్టీలోకి చేరుతున్నారా.. ఇది నిజమేనా..టిడిపి పార్టీలోకి వల్లభనేని వంశీ చేరడం ఏంటి..టిడిపి పార్టీ కి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్యని అసెంబ్లీ వేదికగా అవమానించి ఎంతోమంది కోపానికి బలైన వల్లభనేని వంశీ టిడిపిలోకి చేరడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యంతో కూడిన షాక్ లో మునిగిపోయారు. అయితే ఈ విషయం లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాల్లో ఈ టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. దానికి ప్రధాన కారణం వల్లభనేని వంశీ చేసే పనులే.. అయితే నిజానికి వల్లభనేని వంశీ వైసిపి పార్టీ వాడు కాదు టిడిపి పార్టీలోనే చాలా సంవత్సరాలు కీలకంగా ఎదిగిన నాయకుడు. ఈయన చంద్రబాబు, లోకేష్ లకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు.

 కానీ ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా టిడిపి పార్టీని వదిలి వైసిపి పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసిపి పార్టీ నుండి పోటీ చేసి గెలిచారు కూడా.ఎప్పుడైతే వైసీపీ పార్టీలో వల్లభనేని వంశీ గెలిచారో ఆ తర్వాత టిడిపి పార్టీపై,చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. అంతేకాదు అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వరిని అవమానిస్తూ మాట్లాడారు. కట్ చేస్తే వల్లభనేని వంశీ ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో వైసిపి పార్టీ ఓడిపోయిందో అప్పటినుండి ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.. ముఖ్యంగా వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు బయటకు తీస్తూ అరెస్టులు చేయిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది.

దానికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో వల్లభనేని వంశీ ఎక్కడికి వెళ్లినా కూడా వైసిపి పార్టీ పేరును కానీ,జగన్మోహన్ రెడ్డి పేరును కానీ పలకడం లేదు. అలాగే ఆయన అక్కడికి వెళ్లే సమయంలో కట్టే ఫ్లెక్సీలలో కూడా జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ పార్టీ జెండాను కానీ అందులో పెట్టడం లేదు. కేవలం ఆయన ఒక్కడి ఫోటోకి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంటున్నాయి. అలాగే వైసిపి పార్టీతో కూడా అంటీ ముట్టినట్లుగానే ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది.దీంతో చాలామంది వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నారా.. ఆయన ప్రవర్తనలో ఇంత సడన్  చేంజ్ ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.. మరి నిజంగానే వల్లభనేని వంశీ సొంతగూటికి చేరుతున్నారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: