టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపో యే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు . ఈయన ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎం తో మంది హీరోయిన్లతో ఆడి పాడాడు. ఇకపోతే చిరంజీవి సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగించిన ఓ ముగ్గురు అక్క చెల్లెళ్లతో కలిసి నటించాడు . ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక హీరో చిరంజీవి మాత్రమే కావడం విశేషం. ఆ ముగ్గురు అక్క చెల్లెలు ఎవరు అనుకుంటున్నారా ..? వారు ఎవరో కాదు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీ మణులుగా ఎన్నో సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన వారు అయినటువంటి నగ్మా , జ్యోతిక , రోషిని. నగ్మా , జ్యోతిక , రోషిని ముగ్గురు సొంత అక్క చెల్లెలు. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లలో మొదటగా నగ్మా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె అద్భుతమైన రీతిలో చాలా సంవత్సరాల పాటు కెరియర్ను ముందుకు కొనసాగించింది.

ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఇక నగ్మా స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన తర్వాత జ్యోతిక సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కూడా ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఈమె కూడా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించింది. ఇకపోతే రోషిని స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరకపోయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొంత కాలం క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన మాస్టర్ అనే సినిమాలో నటించింది. చిరంజీవి ఇలా నగ్మా , జ్యోతిక , రోషిని ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లతో కలిసి నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: