అయితే సి. కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత వివాదానికి దారి తీసాయి. తాజాగా ఈ కామెంట్స్‌కి స్పందించిన ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా కొడుకును ఎన్కౌంటర్ చేయాలని చెప్పిన వారు… ఒకసారి అలాంటి బాధ మన ఇంటి మీద పడితే ఏమవుతుందో తెలుసుకుంటారు. సినిమాలు విషయం వస్తే జనం చూస్తారే కానీ… అందరూ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి థియేటర్లకు వెళ్లలేరు. నేను కూడా 45 పైసల టికెట్‌తోనే సినిమాలు చూడటం మొదలు పెట్టాను. ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు ఆకాశాన్నంటాయి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయడం వాళ్ల విషయం… కానీ అందుకు నా కొడుకును చంపాలని చెప్పడం సరైంది కాదు,” అంటూ భావోద్వేగంతో స్పందించారు.
అప్పారావు ఇంకా మాట్లాడుతూ… “నా కొడుకు పక్షాన నిలబడే న్యాయవాదులకు నేను ఆర్థిక సహాయం చేస్తాను. ఆయన చేసిన తప్పు ఏమిటో ముందు నిరూపించాలి. సోషల్ మీడియాలో నా కొడుకును మొదటి నుంచీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వారు చూపుతున్న ప్రేమ నాకు బలం ఇస్తోంది,” అంటూ పరోక్షకంగా రవికిసపోర్ట్ చేశారు. ప్రస్తుతం రవి తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రవి అభిమానులు కూడా అప్పారావును సపోర్ట్ చేస్తూ, “రవి చేసిన తప్పు ఏమిటో ముందుగా చెప్పండి… వెంటనే ఎన్కౌంటర్లు, కఠిన శిక్షలు అంటూ తీర్పులు ఇవ్వడం సరైంది కాదు,” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సినీ పరిశ్రమ పైరసీ నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుండగా… మరోవైపు రవి కుటుంబం తమ వైపు వాదనలు వినిపిస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారి, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి