సుప్రియా ఒకప్పుడు లండన్ ఆధారిత ప్రముఖ అంతర్జాతీయ జర్నలిస్ట్! సినిమాల ప్రపంచానికి, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్‌కు చాలా తేడా ఉంటుంది. అలాంటి సీరియస్ జర్నలిజం రంగంలో టాప్‌గా ఉన్న సుప్రియా... పృథ్వీరాజ్‌ను పెళ్లి చేసుకుని సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఫోన్ కాల్‌తో మొదలైన ప్రేమకథ! .. పృథ్వీరాజ్, సుప్రియా ప్రేమకథలో ఏకంగా సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయని చెబుతున్నారు . వారి బంధం ముఖాముఖి కాకుండా, మొదట్లో ఫోన్ కాల్స్ ద్వారానే మొదలైందట! ప్రొఫెషనల్ పరిచయంగా మొదలైన వారి సంభాషణలు క్రమంగా ప్రేమగా మారి ... చివరికి వివాహ బంధానికి దారి తీశాయి .
సుప్రియా తన లండన్ ఉద్యోగాన్ని, జీవితాన్ని వదిలి పృథ్వీరాజ్‌ను పెళ్లాడి మలయాళ చిత్ర పరిశ్రమ కు రావడం ఒక సాహసమనే చెప్పాలి . సినీ నిర్మాణంలో పవర్ కపుల్! .. వివాహం తర్వాత సుప్రియా కేవలం భార్యగా మాత్రమే కాకుండా, పృథ్వీరాజ్‌కు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచింది. పృథ్వీరాజ్ స్థాపించిన నిర్మాణ సంస్థలో ఆమె కీలక బాధ్యతలు తీసుకుని, నిర్మాతగా మారింది. జర్నలిజం నేపథ్యం, ఆమెకున్న అంతర్జాతీయ అనుభవం ... వారి నిర్మాణ సంస్థకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇలా, స్టార్ హీరోకు సపోర్ట్‌గా నిలుస్తూ, సినీ నిర్మాణంలో తనదైన ముద్ర వేసుకుంటున్న సుప్రియా మీనన్ నిజంగానే పవర్ ఫుల్ పర్సనాలిటీ!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి