ప్రస్తుతం, ఈ సినిమాకు సంబంధించిన టీమ్‌తో కలిసి లోకేష్ స్పెషల్ మీటింగ్స్ లో పాల్గొంటూన్నట్లు తెలుస్తుంది. అది ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ప్రీ-ప్రొడక్షన్ పనులకూ, మరోవైపు హీరోగా చేస్తున్న సినిమాల పనులకూ ఆయన బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ అంటే ఎల్లప్పుడూ ఒక డైలాగ్ స్పష్టంగా వినిపిస్తుంది — “చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు..అనుకున్నది సాధిస్తాడు” ఎప్పటినుంచో తెలుగు హీరోతో సినిమా చేయాలని ఆయన కోరుకున్నారు, ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అందుకే ఆ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవట్లేదు.
దాంతో, సోషల్ మీడియాలో ఇతగాడి పై మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయి. “దమ్మున్న మగాడ్రా బుజ్జి వీడు” అని సరదాగా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. లోకేష్ స్టార్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆ స్టార్ రేంజ్ ఉన్న హీరోనే పట్టేసి ఉంటాడు. ఇప్పుడున్న తెలుగు బిగ్ స్టార్స్ అందరు మూడు నాలుగు సినిమాలు చేతిలో పెట్టుకునే ఉన్నారు. మరి వారిలో ఏ హీరోని పట్టేశాడి ఈ లోఖేష్ కనగరాజ్ తెలియాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి