బ్రహ్మం వివాహం:
ఇందులో మొదట బ్రహ్మం వివాహం గురించి చూస్తే..శీలవంతుడైన వరుడుకి శ్రీమహాలక్ష్మి లాంటి వధువుని దానం చేసే ఆచారాన్ని బ్రహ్మం వివాహం అంటారు.
ఆర్షం:
పెళ్ళికొడుకు నుండి గోవుల జంట తీసుకొని కన్యను వరుడికి ఇవ్వడాన్ని ఆర్షం వివాహం అంటారు. ఈ ఆచారాన్ని ఎక్కువగా ఋషులు ఆచరిస్తారు.
దైవం వివాహం:
యజ్ఞంలో రుత్విక్ గా ఉన్న వరుడికి కన్యను దక్షిణగా ఇచ్చే వివాహాన్ని దైవ వివాహం అంటారు.
ప్రాజాపత్యం:
వధూవరులు ఇద్దరు ధర్మాన్ని ఆచరించి ధర్మంగా ఉండండి అని చెప్పి కన్యాదానం చేసే పద్ధతిని ప్రాజాపత్యం వివాహం అంటారు.ఈ పద్ధతిలో సీతారాముల వివాహం జరిగింది.
గాంధర్వ వివాహం :
వరుడు వధువు ఇద్దరి మధ్య పరస్పర అనురాగంతో మంద్ర విధానం లేకుండా చేసుకునే పద్ధతిని గాంధర్వ వివాహం అంటారు. ఈ ఆచారంలో శకుంతల దుష్యంతుల వివాహం జరిగింది.
అసుర వివాహం:
పెళ్ళికొడుకు దగ్గర డబ్బు తీసుకొని కన్యను ఇచ్చి చేసే పెళ్లిని అసుర వివాహం అంటారు. ఈ పద్ధతిలో కైకేయి దశరథ మహారాజుల పెళ్లి జరిగింది.
పైశాచ వివాహం:
అమ్మాయికి తెలియకుండా పెళ్లి చేసుకోడాన్ని పైశాచ వివాహం అంటారు. ఉదాహరణకు అమ్మాయి నిద్రలో లేదా ఏమరు పాటుగా ఉన్నప్పుడు తాళి కట్టి భార్యగా మార్చుకుంటే దాన్ని పైశాచ వివాహం అంటారు.
రాక్షస వివాహం :
యుద్ధం చేసి కన్యను ఎత్తుకెళ్లి వేరే దగ్గర పెళ్లి చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అంటారు. ఈ పద్ధతిలో మండోదరిని రావణాసురుడు పెళ్లి చేసుకున్నారు.
అయితే మనుస్మృతిలో ఉన్న ఎనిమిది వివాహాలలో ప్రాజాపత్యం, బ్రహ్మం వివాహం ఇవి రెండే శ్రేష్టమైనవి. పైశాచిక రాక్షస వివాహాలు రెండు కూడా నిషిద్ధ వివాహాలు. అయితే ప్రస్తుత జనరేషన్లో ఇలాంటి వివాహాలు జరగడం లేదు. పెద్దలకు నచ్చిన లేక ప్రేమ పెళ్లిళ్లు మాత్రమే జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమంత పెళ్లి చేసుకున్న భూతశుద్ధ వివాహం అనే పద్ధతి మనస్మృతిలో లేదు. ఇది కేవలం ఈషా ఫౌండేషన్ ప్రవేశపెట్టిన పురాతన ఆధ్యాత్మిక వివాహ పద్ధతి. మన హిందూ ధర్మంలోని ఎనిమిది వివాహాలలో భూతశుద్ధ వివాహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి