సౌత్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన హరిహర వీరమల్లు సినిమాలో తన అందంతో స్పెషల్ ఎట్రాక్షన్ గా మెరిసిన నిధి అగర్వాల్ త్వరలోనే ది రాజా సాబ్ అనే పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతోంది. ది రాజా సాబ్ మూవీలో ప్రభాస్ తో రొమాన్స్ చేసే అదృష్టం నిధి అగర్వాల్ కి దక్కినందుకు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా పలువురు బడా స్టార్స్ తో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళుతున్న నిధి అగర్వాల్ రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ కి వెళ్ళింది. అయితే అదే ఈవెంట్ కి ది రాజా సాబ్ మూవీ డైరెక్టర్ మారుతి కూడా వచ్చారు. అలా మారుతీ రావడంతో స్టేజ్ మీద ఉన్న నిధి అగర్వాల్ ఆయన్ని పిలిచి ఫోటో దిగుదాం రండి అని చెప్పింది. 

అయితే హీరోయిన్ పిలిచింది కదా అని వెళ్లి ఆమె పక్కన నిల్చోని ఫోటో దిగితే ఇది అంత పెద్ద న్యూస్ ఏమీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చేసే పనే.కానీ పిలిచింది కదా అని మారుతీ కాస్త అడ్వాంటేజ్ తీసుకొని ఫోటోలు దిగే క్రమంలో నిధి అగర్వాల్ నడుము పై చేయి వేశాడు. వెంటనే నిధి అగర్వాల్ ఆయన చేయిని నవ్వుతూ పక్కకు తీసేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ ఫోటో దిగమని అడిగింది. కానీ నడుము మీద చేయి వేయమని చెప్పలేదు కదా.. నువ్వేమైనా హీరోవా లేక అది సినిమా అనుకున్నావా ఏదో అక్కడే ఉన్నావు కదా అని ఫోటో దిగమని పిలిస్తే ఇలాంటి పని చేస్తావా అంటూ మండి పడుతున్నారు. 

ఇక మరికొంత మందేమో పులితో ఫోటో దిగాలనుకుంటే దిగేసేయ్ తప్పులేదు.. కానీ చనువువిచ్చింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఇక రచ్చ రచ్చే అంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మారుతి చేసిన పని మాత్రం నెట్టింట వైరల్ గా మారడంతో మారుతి ఇదేం పని..అలాంటి అసభ్య ప్రవర్తన ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఇక మరికొంత మందేమో ఈ వీడియోలో అంత తప్పేమీ కనిపించడం లేదు. మారుతి అలాంటి దురుద్దేశంతో ఆమె నడుము పై చేయి వేయలేదు.మొదట నిధి అగర్వాల్ డైరెక్టర్ భుజంపై చేయి వేయగా ఆయన ఏదో ఫ్రెండ్లీగా అలా నడుముపై చేయి వేశాడు. ఆ తర్వాత ఇదంతా కుదిరేలా లేదని నడుము మీద చేయి తీసి మళ్లీ ఫ్రెండ్లీగా చేయి పట్టుకొని ఫోటో దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: