టాలీవుడ్ క్రేజీ హీరో , పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న అవైటెడ్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ది రాజా సాబ్ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్‌టైనింగ్ టచ్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోస్, ప్రాసెస్‌లను చూపించేలా మేకర్స్ ఓ కొత్త సిరీస్‌ను ప్రారంభించారు. ఈ సిరీస్‌లో భాగంగా విడుదలైన ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ తొలి ఎపిసోడ్‌లో మారుతీ చేసిన వ్యాఖ్యలు సినిమా వెనుక ఉన్న అసలైన ఛాలెంజ్ ఏంటన్నదాన్ని స్పష్టంగా చూపించాయి. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదైనా ఉందంటే… అది కథనే అని మారుతీ ఓపెన్‌గా చెప్పారు.


ప్రభాస్ గారికి ఒక మంచి ప్రేమకథా చిత్రం బాగా నచ్చిందని, అలాంటి లైన్‌లో ఏదైనా సినిమా ప్లాన్ చేయమని ఆయన సూచించినట్టు మారుతీ వెల్లడించారు. అయితే అదే సమయంలో ప్రేమకథా జానర్‌లో ఇప్పటికే 500కి పైగా సినిమాలు వచ్చేశాయని, అలాంటి పరిస్థితుల్లో ఒక బిగ్ స్టార్‌తో మళ్లీ అదే కాన్సెప్ట్‌లో సినిమా చేయడం అంత ఈజీ కాదని ఆయన తెలిపారు. అందుకే ఈ కథకు అదనపు బలం ఇవ్వాలని, ప్రేక్షకులు ఊహించని కొత్త ఎలిమెంట్ జోడించాలన్న ఆలోచనతో బలమైన విలన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్టు మారుతీ చెప్పారు. ఈ విలన్ పాత్రే సినిమాకి కీలకంగా మారుతుందని, అదే ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్‌గా నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.


సాధారణంగా హారర్ కామెడీ సినిమాల్లో వినోదానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ ‘ది రాజా సాబ్’ విషయంలో కథ, పాత్రలు, ముఖ్యంగా విలన్ డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని మేకర్స్ హింట్ ఇస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ను ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని కొత్త షేడ్‌లో చూపించేందుకు మారుతీ ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కామెడీ టైమింగ్, రొమాన్స్, హారర్ ఎలిమెంట్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూనే, కథలోని సర్ప్రైజ్ ఫ్యాక్టర్‌ను గట్టిగా దాచిపెట్టడమే అసలు ఛాలెంజ్‌గా మారిందని చెప్పాలి. అదే సమయంలో అదే ఛాలెంజ్… సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్ కూడా అవుతుందని టీమ్ భావిస్తోంది. హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ నుంచి ఎలాంటి కొత్త అనుభూతి దొరుకుతుందోనన్న ఆసక్తి ఇప్పుడు రెట్టింపు అయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: