ఏంటి సుమన్ సినీ కెరియర్ నాశనం అవ్వడానికి.. ఆయన బ్లూఫిలిమ్స్ కేసులో ఇరుక్కోవడానికి కారణం మొత్తం ఆ దరిద్రురాలేనా.. ఆ దరిద్రురాలి వల్లే ఈయన జీవితం సతమతమయ్యిందా అనేది ఇప్పుడు చూద్దాం. సుమన్ బ్లూ ఫిలిమ్స్ కేసు ఆయన జీవితాన్ని దెబ్బ కొట్టింది. ఈ కేసులో ఎప్పుడైతే ఆయన జైలుకు వెళ్లారో అప్పటినుండి ఆయన సినీ జీవితం మొత్తం నాశనం అయింది. జైలు నుండి బయటకు వచ్చాక ఆయనతో సినిమాలు చేయడానికి ఒప్పుకున్న దర్శక నిర్మాతలందరూ సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు.కొంతమంది ఫ్రెండ్స్ కూడా అప్పు తీసుకొని ఎగ్గొట్టారు.దాంతో సుమన్ చిన్న చిన్న పాత్రలు చేయాల్సి వచ్చింది. 

అయితే అలాంటి సుమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బ్లూఫిలిమ్స్ కేసులో ఇరుక్కోవడానికి కారణం తమిళనటుడు ఎంజీఆర్, రాష్ట్ర డిజిపి, లిక్కర్ కాంట్రాక్టర్ వాడియార్.. ఈ ముగ్గురి వల్లే నేను కేసులో ఇరుక్కున్నాను. అయితే ఆ రాష్ట్ర డిజిపి కూతురికి అప్పటికే పెళ్లయింది. కానీ నన్ను చూసి ఆమె చాలా ఇష్టపడింది. నా సినిమా షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి పోలీస్ బందోబస్తు వచ్చి చూసి వెళ్ళేది.ఇక ఇదంతా గమనించిన ఆ డిజిపి నా గురించి ఎంజీఆర్ కి చెప్పారు. అలా ఎంజీఆర్ ఓ రోజు నన్ను పిలిచి మాట్లాడలేని స్థితిలో ఉన్న సమయంలో పేపర్ మీద రాసి నటుడిగా నీకు మంచి భవిష్యత్తు ఉంది. అవన్నీ వద్దు అని చెప్పారు.

దాంతో నేను ఈ విషయం నాకు కాదు ఆ అమ్మాయికి చెప్పండి అని బదిలివ్వడం ఎంజీఆర్ కి నచ్చలేదు. అయితే అప్పటికే లిక్కర్ కాంట్రాక్టర్ కూతురిని నా ఫ్రెండు ప్రేమించడంతో వాళ్లంతా పగబట్టి నన్ను అల్లర్ల కేసులో ఇరికించి లోపలికి పంపించాక ఏవేవో కేసులు పెట్టారు అంటూ సుమన్  చెప్పుకొచ్చారు.అలా సుమన్ దాదాపు మూడు నెలలు జైల్లో ఉన్న సమయంలో అప్పటి గవర్నర్ సుమన్ తల్లికి బాగా తెలియడంతో చివరికి ఆ కేసు నుండ బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక ఆయనకి సినిమా అవకాశాలన్నీ చేజారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: