అలాంటి సమయంలో కొంతమంది అభిమానులు ప్రభాస్ పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటూ ఒక ఫ్లకార్డు పట్టుకొని మరి అక్కడ కనిపించారు. ఆ విషయాన్ని చూసిన వెంటనే సుమ ప్రభాస్ దగ్గరకు వెళ్లి మరి మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే ఏదైనా క్వాలిటీ చెప్పండి సార్ అని ప్రభాస్ ని అడగగా?.. ఆ వెంటనే ప్రభాస్ ఆ క్వాలిటీ ఏదో తెలియకే తాను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉన్నానని సమాధానాన్ని చెప్పారు. దీంతో అటు సుమతో పాటుగా, అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వులలో మునిగిపోయారు.
ఈవెంట్ లోనే డైరెక్టర్ మారుతి కూడా సినిమా పైన వస్తున్న విమర్శలకు కౌంటర్ వేస్తూ ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తే మాత్రం ఎవరైనా సరే మా ఇంటికి రండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కొల్ల లగ్జోరియా, విల్లా నెంబర్ 17, కొండాపూర్ లో ఉంటుంది ఇదే నా అడ్రస్ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మాళవికా మోహన్, నిధి అగర్వాల్ , రిద్ది కుమార్ నటిస్తున్నారు. అలాగే విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ ఇలాంటి హర్రర్ కామెడీ జోనర్ థ్రిల్లర్ చిత్రంలో కనిపిస్తూ ఉండడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,సాంగ్స్ అన్ని కూడా సినిమా అంచనాలను పెంచేశాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి