ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు రాజమౌళిపై తీవ్ర అసహనం కలిగిందట. ఇది షూటింగ్ ప్రారంభ దశలో కాదు. దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు సాగిన ఆ సుదీర్ఘ ప్రయాణంలో, ఒక కీలక దశలో చరణ్ తీవ్రంగా అలసిపోయి, మానసికంగా కూడా ఒత్తిడికి గురయ్యారట.ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుందట. ఎండలో, దుమ్ములో గంటల తరబడి కష్టపడుతూ సన్నివేశాన్ని చేస్తుంటే, రాజమౌళి పర్ఫెక్షన్ కోసం పదే పదే రీటేకులు అడిగారట. “ఇంకొకసారి… వన్ మోర్” అని రాజమౌళి పదేపదే అనడంతో, అప్పటికే శారీరకంగా అలసిపోయిన చరణ్‌కు చిరాకు వచ్చిందట.
ఒకానొక సమయంలో తన కోపాన్ని అదుపు చేసుకోలేక, రాజమౌళి వైపు చాలా సీరియస్‌గా చూశారట రామ్ చరణ్. ఆ క్షణం యూనిట్‌లో ఉన్నవాళ్లందరికీ గమనించదగ్గదిగా మారిందట. అప్పట్లో ఈ విషయం యూనిట్ సభ్యుల మధ్య పెద్ద చర్చగానే సాగిందని చెప్పుకుంటారు. అయితే, రాజమౌళి మాత్రం ఏమీ తెలియనట్టు నవ్వుతూ తన పని తాను చేసుకుపోయారట.రాజమౌళి కోపానికి కూడా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పేరు ఉందని రామ్ చరణ్ ఒకసారి సరదాగా గుర్తు చేసుకున్నారు. రాజమౌళికి కోపం వస్తే చేతిలో ఉన్న మైక్‌ను విసిరికొడతారని, ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే భయంగా ఉండేదని చరణ్ నవ్వుతూ చెప్పారు. అయినప్పటికీ, ఆ కోపం, ఆ కఠినమైన పర్ఫెక్షన్ వల్లే ‘నాటు నాటు’ వంటి ప్రపంచస్థాయి పాట, అల్లూరి సీతారామరాజు వంటి పవర్‌ఫుల్ పాత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చాయని ఆయన గర్వంగా చెబుతుంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి