సాయంత్రం 4:05 భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ AAA సినిమాస్,హైదరాబాద్:సాయంత్రం 6:04 అనగనగా ఒక రాజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్:రాత్రి 7:00 మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ .ఇలా మూడు భారీ ఈవెంట్స్ ఒకేరోజు జరుగుతుండటంతో అభిమానుల్లో, ఫ్యాన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది.
రవితేజ 'మాస్' జాతర: మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్‌ను సాయంత్రం 4 గంటలకే విడుదల చేసి ప్రమోషన్లకు గట్టి పునాది వేయనున్నారు.
నవీన్ పోలిశెట్టి సర్ప్రైజ్: చాలా కాలం తర్వాత వెండితెరపైకి వస్తున్న నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' ట్రైలర్ ఈవెంట్‌తో తన మార్క్ కామెడీని ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారు.
మెగాస్టార్ సందడి: ఈ రోజులో అత్యంత భారీ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ-రిలీజ్ ఈవెంట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, ఈ వేడుకను అత్యంత వైభవంగా ప్లాన్ చేశారు.
ఒకే రోజున మూడు పెద్ద సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ ఉండటం వల్ల సోషల్ మీడియాలో ఏ సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' మినహా మిగిలిన అన్ని ప్రధాన చిత్రాల అప్‌డేట్స్ ఈ రోజే రాబోతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి