చిరంజీవి గారి స్పీచ్‌లో అత్యంత ఆకట్టుకున్న అంశం ఆయన పెద్దరికం. సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నప్పటికీ, ఆయన అందరినీ విష్ చేశారు. "ఈ సంక్రాంతి కేవలం నాది కాదు, మన తెలుగు పరిశ్రమది కావాలి" అని ఆయన గంభీరంగా ప్రకటించారు."తమ్ముడు ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ పెద్ద హిట్ కావాలి" అని ఆయన కోరుకున్నారు. "రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఘనవిజయం సాధించాలి" అని చిరు ఆకాంక్షించారు.తన ‘శిష్యుడు’ అని పిలుచుకునే నవీన్ పోలిశెట్టి సినిమా కూడా బాగా ఆడాలని ఆయన కోరుకున్నారు.మొత్తంగా, 2026 సంక్రాంతిని తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదని, ప్రేక్షకులు అన్ని సినిమాలనూ థియేటర్లలో చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఆయనలోని ‘అన్నయ్య’ మనస్తత్వానికి నిదర్శనం.
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ చిరంజీవి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. "అనిల్‌తో సినిమా చేయమని రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో చెబుతుండేవారు. ఆయన కోరిక మేరకే ఈ ప్రాజెక్ట్ మొదలైంది" అని చెప్పారు. ముఖ్యంగా ఈ తరానికి ‘వింటేజ్ చిరు’ని చూపించాలనే కసితో అనిల్ రావిపూడి ఈ సినిమా చేశాడని ఆయన ప్రశంసించారు. "షూటింగ్ ప్రతిరోజూ నాకు ఒక ఎక్స్ కర్షన్ లా అనిపించింది. చివరి రోజు సెట్ వదిలి వెళ్తుంటే కాలేజీ నుంచి ఫేర్ వెల్ తీసుకుంటున్నట్లు ఎమోషనల్ అయ్యాను" అని చిరు పేర్కొన్నారు. అంత సరదాగా ఈ సినిమా షూటింగ్ జరిగిందని ఆయన చెప్పారు.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించడం గురించి చిరు చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి. "వెంకటేష్ మోడ్రన్ డే గురువులా ఉంటాడు. తను లైఫ్ ని, సినిమాని చాలా బాగా బ్యాలన్స్ చేస్తాడు. మేమిద్దరం కలిసి చేసిన ఆ 18 రోజులు కేవలం షూటింగ్ కాదు.. ఒక సెలబ్రేషన్" అని అన్నారు. అంతేకాదు, అనిల్ రావిపూడిని ఉద్దేశిస్తూ.. "మా ఇద్దరి కాంబినేషన్ కోసం ఒక ఫుల్ లెంగ్త్ స్టోరీ రాయ్.. మేమిద్దరం కలిసి రచ్చ రచ్చ చేయడానికి రెడీ" అని చిరు చేసిన అనౌన్స్‌మెంట్ తో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. చిరు-వెంకీ కాంబోలో ఫుల్ మూవీ అంటే అది టాలీవుడ్‌కు అతిపెద్ద పండగే!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేసిందని చిరు కొనియాడారు. ఆమె ప్రమోషన్లలో పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో ‘హుక్ స్టెప్’ హైలైట్ కాబోతుందని, థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చను ఊహించలేమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
"జనవరి 12న థియేటర్లలో కలుద్దాం.. ఇది పక్కా వినోదాల విందు" అని చిరంజీవి తన స్పీచ్ ముగించారు. చిరంజీవి గారిలోని ఆ జోష్, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తోంది. మెగాస్టార్ బాటలోనే ఇతర హీరోల సినిమాలకు కూడా మంచి జరగాలని కోరుకోవడం ఆయన స్థాయిని మరోసారి నిరూపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి