రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ది రాజా సాబ్ సినిమా తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహించగా ... నిధి అగర్వాల్ , మాలవిక మోహన్ ,  రీద్ధి కుమార్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమా భారీ స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టదేమో అని కొంత మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లభించాయి. ఇకపోతే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ది రాజా సాబ్ మూవీ అద్భుతమైన స్థానంలో నిలిచింది. ఈ మూవీబ్లాక్ బస్టర్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన షేర్ కలెక్షన్లను కూడా దాటేసింది. ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 43 కోట్ల షేర్   కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే తాజాగా విడుదల అయిన ది రాజా సాబ్ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 43.71 కోట్ల షేర్ కలక్షన్లు దక్కాయి. అలా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న బాహుబలి 2 మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన షేర్ కలక్షన్ల కంటే కూడా ది రాజా సాబ్ మూవీ ఎక్కువ షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: