ట్రైలర్ విషయానికి వస్తే.. కమెడియన్ సత్య కామెడీ తోనే మొదలవుతుంది.. అవును గౌతమ్ ఎవరమ్మా అంటూ శర్వానంద్ గర్ల్ ఫ్రెండ్ తండ్రి పలికిన డైలాగ్ శర్వానంద్ ఎంట్రీ ఇస్తారు. ఇందులో శర్వానంద్ తనని తాను పరిచయం చేసుకొని సీన్స్ కూడా హైలెట్ గా కనిపిస్తున్నాయి. శర్వానంద్ తన గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి పెళ్లికి సిద్ధం అనుకుంటున్నా సమయంలో, తన జీవితంలోకి ఎక్స్ లవర్ అకస్మాత్తుగా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఇద్దరి మధ్య శర్వానంద్ ఎదుర్కొనే సమయంలో వచ్చే హాస్య సన్నివేశాలు ట్రైలర్లో హైలెట్గా నిలిచాయి.
అటు సంయుక్త, శర్వానంద్, సాక్షి వైద్య మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్ కూడా ట్రైలర్ ను హైలెట్గా చేశాయి. ముఖ్యంగా శర్వానంద్ కామెడీ టైమింగ్ కూడా హైలెట్ గా ఉండడంతో కచ్చితంగా సంక్రాంతికి శర్వానంద్ సక్సెస్ కొడతారని ధీమా అభిమానులలో కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఇబ్బంది పడుతున్న శర్వానంద్ కి ఈ సినిమా ఊరట కలిగించేలా ఉంది..అలాగే కమెడియన్ సునీల్, వీకే నరేష్, సత్య కామెడీతో హైలెట్ కాగా, భీమ్స్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంటోంది.మొత్తానికి తన కామెడీ మార్క్ తో మరొకసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడానికి సిద్ధమయ్యారు శర్వానంద్. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి