ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఇక ఇప్పటికే దాదాపు సంక్రాంతి సందర్భంగా కొన్ని తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో ఏ సినిమాకు ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ , మాలవిక మోహన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన రాజా సాబ్ మూవీ జనవరి 9 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు బుక్ మై షో లో సేలింగ్స్ చాలా వరకు తగ్గాయి. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 82.32 కే టికెట్లు సేల్ అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నిన్న అనగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన 488.15 కే టికెట్లు సేల్ అయ్యాయి.

మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఈ రోజు అనగా జనవరి 13 వ తేదీన థియేటర్లను విడుదల కానుంది. ఇక ఆఖరి 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 18.28 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

నవీన్ పోలిశెట్టి తాజాగా అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 14.58కే టికెట్లు సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: