ఈ గ్లింప్స్ చూస్తూ ఉంటే డైరెక్టర్ వేణు మరొకసారి మన మట్టిని ,సాంప్రదాయాలను సైతం వెండితెర పైన అద్భుతంగా ఆవిష్కరించబోతున్నట్లు కనిపిస్తోంది. గ్లింప్స్ విషయానికి వస్తే.. ఆరంభంలోనే గాలిలో సుడులు తిరుగుతూ ఆకాశంలో ఎగిరే వేపాకును చూపిస్తూ అలాగే మేకను చూపిస్తూ ఒక అద్భుతమైన విజువల్స్ ని చూపిస్తూ ఏదో ఒక దివ్య శక్తి రానున్నట్టుగా సూచించాయి. గజ్జల చప్పుడుతో ఒకరు బూట్లతో మరొకరు పరిగెత్తుకుంటూ రావడం, మబ్బులకు అమ్మవారి రూపంగా మారడం వంటి దృశ్యాలు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నయి.
చివరిలో వర్షంలో తడుస్తూ నడుముకు డోలు కట్టుకొని ఉండే పాత్రలో దేవిశ్రీప్రసాద్ ఎంట్రీ చూపించడం హైలెట్ గా నిలిచింది. కొన్నేళ్లపాటు సంగీత దర్శకుడిగా ఆకట్టుకున్న దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు తన నటనతో మెప్పించడానికి సిద్ధమయ్యారు. లాంగ్ హెయిర్ షర్టు లేకుండా మాస్ లుక్ లో దేవిశ్రీ ప్రసాద్ కనిపించిన లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ పాత్ర కోసం దేవిశ్రీప్రసాద్ ఎంత శ్రమించారో ఈ గ్లింప్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఎల్లమ్మ గ్లింప్స్ పసుపు, కుంకుమ, వేపాకులు వంటి ఎలివేషన్స్ తోనే చాలా సహజంగా భక్తి భావం ఉట్టిపడేలా తీసినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి