తరచూ ఈ మధ్య సోషల్ మీడియాలో జరిగేటువంటి విమర్శల వల్ల, నెగిటివ్ కామెంట్స్ వల్ల చాలామంది సెలబ్రిటీలు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ విషయాలపైన స్పందించారు. తాజాగా జాన్వీ కపూర్ ఈ విషయం పైన ఘాటుగానే స్పందించింది. సోషల్ మీడియా వేదికలలో ఎవరో ఏదో అనుకుంటారని తాను అసలు బాధపడనని కేవలం అవన్నీ వ్యూస్ కోసం చేసే పనులే అంటూ తన పైన వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ పైన గట్టి కౌంటర్ వేసింది జాన్వీ కపూర్.



సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యూస్, లైక్స్ కోసమే చాలామంది సెలబ్రిటీల పేర్లను వాడుకొని ఏదో ఒక కంటెంట్ ని క్రియేట్ చేస్తూ మమ్మల్ని కేవలం బలిపశువుల వాడేసుకొని, వారి పేజీలకు లైక్స్ సంపాదించుకుంటున్నారు. అలా వారు మన గురించి అనే మాటలను మనం అసలు పట్టించుకోమని ,మన గురించి కాదు కేవలం వారి యొక్క బిజినెస్ గురించే అంటూ తెలియజేసింది. అందుకే తన మీద వచ్చే నెగటివ్ కామెంట్స్ ని అసలు పట్టించుకోనని అలాగే తన సోదరుడు అర్జున్ కపూర్ ఎదుర్కొనే బాడీ షేమింగ్స్, ట్రోల్స్ గురించి కూడా ఆమె ఎమోషనల్ గా మాట్లాడింది.


ప్రతి ఒక్కరు తమ ఇల్లును గడుపుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది చాలా చిన్న విషయమే దీని గురించి ఐదు నిమిషాల కంటే ఎక్కువగా ఆలోచించడం సమయం వృధా అని, అది వేధింపుల స్థాయికి చేరినప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరంగా బాధ కలుగుతుందని, ముఖ్యంగా నా అన్న విషయంలో జరుగుతున్న వాటికి ఎటువంటి సాకులు చెప్పలేం, నెగెటివిటీని వదిలేయడమే మంచిదని తెలియజేసింది. ప్రస్తుతం జాన్వీ కపూర్, రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: