‘పుష్ప 2: ది రూల్’ వంటి భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, పాన్-ఇండియా సూపర్ స్టార్‌గా తన స్థానాన్ని బలంగా స్థిరపరుచుకున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకూ ఆయనకు ఉన్న క్రేజ్ ఇప్పుడు మరో లెవెల్‌లో ఉంది. ఇలాంటి టైమ్‌లో కథ ఎంపిక విషయంలో బన్నీ తీసుకునే ప్రతి నిర్ణయం ఇండస్ట్రీ ట్రెండ్‌ను మార్చే స్థాయిలో ఉంటుంది.అందుకే, “ఎవరూ ఊహించని దర్శకుడిని, అల్లు అర్జున్ ఎందుకు ఎంచుకున్నాడు?” అన్న ప్రశ్న మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ‘కూలీ’ వంటి భారీ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో, ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పెద్ద హీరోలను హ్యాండిల్ చేయలేడనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఈ కారణంతోనే రజనీ – కమల్ హాసన్ కాంబోతో అనుకున్న ప్రాజెక్ట్ సహా మరికొన్ని పెద్ద ఆఫర్లు చేజారిపోయాయన్న టాక్ కూడా వినిపించింది.
ఇలాంటి ఇమేజ్‌తో ఉన్న దర్శకుడికి, ఫుల్ ఫార్మ్‌లో ఉన్న అల్లు అర్జున్ అవకాశం ఇవ్వడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే అని చెప్పాలి.సినీ పండితుల అంచనాల ప్రకారం, అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌ను కేవలం దర్శకుడి గత ఫలితాల ఆధారంగా కాకుండా, కథ బలాన్ని చూసే ఓకే చేశాడని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం, ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపొందే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటివరకు భారతీయ సినిమాలో పూర్తిస్థాయిలో రాని ఒక కొత్త తరహా సూపర్ హీరో ప్రపంచాన్ని ఈ చిత్రం ఆవిష్కరించవచ్చని టాక్.
ఇదే బన్నీ ధైర్యానికి కారణమని పలువురు భావిస్తున్నారు. మార్కెట్ ఫార్ములాలకు అతుక్కుపోకుండా, కొత్త జానర్‌లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీకి కొత్త దిశ చూపాలన్న ఆలోచనతోనే అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు.ఈ కాంబినేషన్ టాలీవుడ్‌కే కాదు, పాన్-ఇండియా సినీ అభిమానులను షేక్ చేస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. బడ్జెట్, స్కేల్, విజువల్ స్టైల్. కొంతమంది అభిమానులు ఈ సినిమా భారతీయ సూపర్ హీరో కథలను మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం లోకేష్ టాలెంట్‌పై పూర్తి నమ్మకంతో, ఈ కాంబో ఒక కల్చరల్ మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నిజంగా ఇది సూపర్ హీరో సినిమా అయితే, అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచే అవకాశముందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇక అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ సంచలనం ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. అప్పటివరకు మాత్రం… బన్నీ ధైర్యం, లోకేష్ ప్రతిభ – ఈ కాంబోపై చర్చలు ఆగేలా లేవు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి