మెగాస్టార్ చిరంజీవికి,మంచు మోహన్ బాబుకి మధ్య అంత సఖ్యత ఉండదు అని ఇండస్ట్రీలో ఎప్పటినుండో వినిపిస్తున్న విషయమే.. ఆ మధ్యకాలంలో జరిగిన ఓ వజ్రోత్సవ వేడుకలో కూడా వీరికి లైవ్ లోనే గొడవ జరిగింది.చిరంజీవికి ఇచ్చే అవార్డు గురించి మోహన్ బాబు గొడవపెట్టారు.దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఇందులో కల్పించుకొని మోహన్ బాబుకి ఇచ్చి పడేశారు. అలా అప్పటినుండి వీరి మధ్య అంతా సఖ్యత అయితే కొనసాగడం లేదు. ఎప్పుడు వీరి మధ్య ఏదో ఒక గొడవ తలెత్తుతూనే ఉంటుంది.కానీ అప్పుడప్పుడు వీరు ఫంక్షన్స్ లలో కలుసుకున్నప్పుడు సఖ్యతగా ఉన్నట్టే మెదులుతారు.ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సందర్భంగా ఈ సినిమాని ఎంతో మంది సెలబ్రెటీలు చూసి రివ్యూలు ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మోహన్ బాబు కూడా ఈ సినిమాపై స్పందించాల్సిందిగా ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.

మోహన్ బాబు ప్రతి సంక్రాంతికి తన విద్యానికేతన్ విద్యాసంస్థల లోని యాజమాన్యంతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు అనే సంగతి మనకు తెలిసిందే.అలా ఈ ఏడాది కూడా విద్యానికేతన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అక్కడికి వచ్చిన కొంతమంది మోహన్ బాబుని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. మోహన్ బాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుండగా అక్కడికి వచ్చిన ఓ మీడియా ప్రతినిధి ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా.. ఈరోజు పండగ కాబట్టి రాజకీయాల గురించి అవసరం లేదు అందరికీ శుభం జరగాలి అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో మీడియా ప్రతినిధి తాజాగా మీ చిరకాల మిత్రుడు చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని గురించి మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా.. మోహన్ బాబు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.

ఈరోజు భోగి కాబట్టి నేను పండగ గురించే మాట్లాడుతాను. సినిమాల గురించి అస్సలు మాట్లాడను. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజన్స్మీడియా ప్రతినిధులకు పండుగ సమయంలో కూడా అలాంటి ప్రశ్నలు అడగడం అవసరమా..మోహన్ బాబు చెప్పే ఆన్సర్ ని బట్టి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసి మళ్లీ మెగా మంచు ఫ్యామిలీకి మధ్య మంట పెట్టాలనే కదా వారి ఉద్దేశం.. పండుగ సమయంలో అలాంటి ప్రశ్నలు రాకపోతే ఏమవుతుంది..ఈ మీడియా వాళ్లకు ఏదో ఒక వివాదం లేకపోతే పూట గడవదు కావచ్చు అంటూ ఏకిపారేస్తున్నారు. ఇక మరి కొంత మందేమో మోహన్ బాబు కి చిరంజీవి సినిమా గురించి స్పందించడం ఇష్టం లేదు కావచ్చు. అందుకే అలా రియాక్ట్ అయ్యారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: