తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నాను ఒక దర్శకుడు ఇబ్బంది పెట్టారనే విషయాన్ని తెలియజేసింది. ఇంటిమేట్ సీన్స్ లో నటించాలని ఒక దర్శకుడు తనని చాలా ఇబ్బంది పెట్టారని, ఆ సీన్స్ తనకి కంఫర్ట్ గా లేదని కూడా చెప్పాను ఆ స్టార్ హీరో ముందే తనని అవమానించారు అంటూ తెలియజేసింది. అంతేకాకుండా హీరోయిన్ ని మార్చేయండి అంటూ చాలా గోల చేశారని, అలా చేసేసరికి తనకి అవమానంగా అనిపించింది. అయినా కూడా ఆ సీన్ చేయనని చెప్పడంతో చివరికి ఆ డైరెక్టర్ తన క్షమాపణలు చెప్పారంటూ తెలియజేసింది తమన్నా.
అయితే తమన్నా మిద అంత ఒత్తిడి చేసిన డైరెక్టర్ ఎవరు? అది ఏ హీరో సినిమా అనే విషయం మాత్రం చెప్పలేదు ప్రస్తుత తమన్నా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్లో హీరో షాహిత్ కపూర్ తో కలిసి ఓ రోమియో అనే చిత్రంలో నటిస్తోంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలుగులో ఒక సినిమా తమిళంలో కూడా ఒక సినిమాలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది తమన్నా
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి