ఈ బ్యూటీ మరెవరో కాదు, ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లు మరియు చిన్న సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే మెగాస్టార్ పక్కన అవకాశం రావడం అంటే అది ఆమె కెరీర్‌కే ఒక టర్నింగ్ పాయింట్. "చిరంజీవి గారితో ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేసుకున్నా చాలు" అని ఎంతోమంది హీరోయిన్లు కలలు కంటారు. అలాంటిది ఏకంగా ఒక ఫుల్ లెంగ్త్ మాస్ సాంగ్‌లో చిరంజీవి చేయి పట్టుకుని స్టెప్పులేసే ఛాన్స్ దక్కించుకోవడంతో ఈమె జాతకం ఒక్కసారిగా మారిపోయింది.సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆ పాటలోని ఫోటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "మెగాస్టార్ పక్కన ఈ అమ్మాయి ఎవరో కానీ, డాన్స్ ఇరగదీసింది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఎక్స్‌ప్రెషన్స్ మరియు స్టైలిష్ లుక్ సినిమాకే ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. చిరంజీవి లాంటి లెజెండరీ డాన్సర్ పక్కన తడబడకుండా, ఆయన స్పీడుకు తగ్గట్టుగా మూమెంట్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
దర్శకుడు అనిల్ రావిపూడికి ఏ హీరో పక్కన ఏ బ్యూటీ సెట్ అవుతుందో పక్కాగా తెలుసు. 'MSG' లో ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆయన ఎంతోమందిని ఆడిషన్ చేసి, చివరకు ఈమెను ఫైనల్ చేశారట. ఆ సెలక్షన్ పక్కా అని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ నిరూపిస్తోంది. థియేటర్లలో ఈ సాంగ్ వస్తున్నప్పుడు మాస్ ఆడియన్స్ వేస్తున్న ఈలలు, గోలలు చూస్తుంటే ఈ భామకు టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్ ఉందని అర్థమవుతోంది.ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్ అవ్వడం అంటే ఇదే. మెగాస్టార్ చిరంజీవి సినిమా ద్వారా పరిచయమైన ఈ భామ, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద ప్రాజెక్టులలో కనిపించడం ఖాయం. ప్రస్తుతం 'శంకర వరప్రసాద్ గారు' రికార్డులు సృష్టిస్తుంటే, ఈ మిల్కీ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి