ప్రముఖ నటి మాళవిక మోహనన్ ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. 'ది రాజాసాబ్' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీ, భాషా బేధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఒక సందర్భంలో తన సినీ ప్రయాణం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు మన అనుకునే వ్యక్తుల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
వేర్వేరు జానర్లలో స్టార్ హీరోలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కడం వల్ల తనను తాను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నట్లు మాళవిక తెలిపారు. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన 'హృదయ పూర్వం' అనే సినిమా చేశానని వెల్లడించిన ఆమె, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' చిత్రంలో నటించడం ఒక భిన్నమైన అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికే తమిళంలో ధనుష్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ భామ, రానున్న రోజుల్లో కార్తీతో కలిసి 'సర్దార్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
నటిగా తనకు ఇది చాలా గొప్ప సమయమని, తనకు వేర్వేరు భాషలు మాట్లాడటం వచ్చని ఆమె గుర్తు చేశారు. అందుకే ఇకపై కేవలం ఒకే ఇండస్ట్రీకి పరిమితం కావాలని అనుకోవడం లేదని, వివిధ సంస్కృతుల వారితో కలిసి పనిచేయడం తనకు ఇష్టమని స్పష్టం చేశారు. విభిన్న భాషా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని మాళవిక మోహనన్ ఈ సందర్భంగా వెల్లడించారు. నా దృష్టిలో ఫ్యాషన్ అంటే చీరలు కట్టుకుని నుదుటిపై ఎర్రని బొట్టు, కళ్ళకు కాటుక, పువ్వులు పెట్టుకోవడమే అని ఆమె తెలిపారు.నేను మన సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి