తన నెక్స్ట్ సినిమా కోసం ఒక అదిరిపోయే ఐడియా ఉందని ఈసారి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేసినప్పుడే మీరంతా ఆశ్చర్యపోతారని.. ఈ పేరు వినగానే వామ్మో వీడేంట్రా బాబు మళ్లీ ఏదో కొత్తగా మొదలు పెట్టారని మాట్లాడుకుంటారంటూ నవ్వుతూ తెలియజేశారు అనిల్ రావిపూడి. దీన్నిబట్టి చూస్తే ఈసారి టైటిల్ చాలా విచిత్రంగా ఉంటుందని హింట్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు F2, F3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా కీలకమైన పాత్రలో కనిపించారు వెంకటేష్.
ఇప్పుడు మరొకసారి విక్టరీ వెంకటేష్ తోనే సినిమా చేయబోతున్నారనే విధంగా టాలీవుడ్ లో గుసగుసలు కనిపిస్తున్నాయి. 2027 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పూజ హెగ్డే గత కొన్ని సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి. దీంతో నేటిజన్స్ సైతం అనిల్ గారు పూజ హెగ్డేను తీసుకుంటే మీ సక్సెస్ గ్రాఫ్ ని మీరే రిస్క్ లో వేసుకున్నట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఐరన్ లెగ్ సెంటిమెంట్ ఆలోచించండి అటు పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి