కన్నడలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన యష్ కేజిఎఫ్ సిరీస్ల తో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యష్, తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత టాక్సిక్ సినిమాని చేస్తూ ఉండడంతో అంచనాలను పెంచేస్తోంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, హుయా ఖురేషి తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ లభించింది.ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


అయితే విడుదల తేదీ విషయంలో పోస్ట్ పోన్ అంటూ వినిపిస్తూ ఉండడంతో తాజాగా మరొకసారి మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాక్సిక్ సినిమా దురంధర్ 2 సినిమా వల్ల వాయిదా పడుతుందనే విధంగా వినిపిస్తోంది. హీరో రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమాలో నటించగా భారీ సక్సెస్ అందుకుంది. కేవలం హిందీలో ఒక్కటే ఈ సినిమా రూ .1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. దురంధర్ 2 సినిమా కూడా మార్చి 19న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ రెండు బడా సినిమాల మధ్య ఒక బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది.


ఇటువంటి సందర్భంలోనే యష్ టాక్సిక్ సినిమా వాయిదా పడుతుందంటూ వినిపిస్తున్న వార్తల పైన తాజాగా మేకర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఎలాంటి కారణాల వల్ల కూడా టాక్సిక్ సినిమా వాయిదా పడే అవకాశం లేదంటూ క్లారిటీగా చెప్పేశారు. దీంతో టాక్సిక్  సినిమా వాయిదా అంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు. దీన్నిబట్టి చూస్తే మార్చి 19వ తేదీన బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు వార్ సిద్ధమైనట్టుగానే కనిపిస్తోంది. మరి ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: