తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా, బడా ఫ్యామిలీ కూతురుగా పేరు సంపాదించిన మంచు లక్ష్మి గురించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో టీవీ షోలలో హోస్ట్ గా చేసిన మంచు లక్ష్మి ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. ఆ తర్వాత కీలకమైన పాత్రలలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది మంచు లక్ష్మి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించి ఏదో విషయం పైన స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి చెన్నై వెళ్లగా అక్కడ ఒక హోటల్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.


మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ.. చెన్నైలో గ్రీన్ పార్క్ హోటల్ లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని తెలియజేస్తూ ఈ విషయంలో తను పూర్తిగా నిరాశ చెందాను.. నేను ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాను ఎక్కడా కూడా ఇలాంటి రూల్స్ చూడలేదు. హోటల్లో కనీసం నా కెమెరా మ్యాన్ ను కూడా అనుమతించలేదు. ఇక్కడ కెమెరాలను హోటల్ రూమ్లో అనుమతించలేదు. ఈ విషయాన్ని తనకు ఎక్కడ ప్రకటన కూడా చేయలేదు. ఇక్కడి మేనేజర్ ప్రవర్తన కూడా చాలా దురుసుగానే ఉందంటూ తెలియజేసింది.


తాను అడిగిన ఏ ప్రశ్నకు కూడా హోటల్ సిబ్బంది సరైన సమాధానాన్ని చెప్పలేదని ఇదివరకు నేను ఇదే హోటల్లో ఎన్నో ఫోటోలు దిగిన ఫోటోలను చూపించడంతో అనుమతిచ్చారని, కానీ అతిథులకు ఇచ్చే గౌరవ మాత్రం ఇది కాదు తాను ఎన్నోసార్లు గ్రీన్ పార్క్ హోటల్స్ కి వెళ్లాను ఆ హోటల్ అంటే నాకు చాలా అభిమానం కానీ ఇక్కడే ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది, ఇకమీదట ఇలాంటివి జరగకుండా యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని కోరింది మంచు లక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: