పూర్తి వివరాల్లోకి వెళితే కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తూ రణవీర్ సింగ్ వాట్సాప్ కి కొంత మంది గుర్తు తెలియని దుండగులు వాయిస్ నోట్ పంపించారు. ఈ విషయం పైన రణవీర్ ముంబై పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆ వెంటనే ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కూడా పెంచారు. హీరోని బెదిరించిన వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేశారు. దీంతో ఈ విషయం పైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయడంతో దీంతో పోలీస్ సిబ్బంది , ప్రైవేట్ బాడీ గార్డులు ఎక్కువగా మోహరించడంతో వారి చేతిలో ఉన్న ఆయుధాలను చూసి సొసైటీ యాజమాన్యం పోలీసులకు ఒక లేఖ ద్వారా వివరణ ఇవ్వాలంటూ రాసింది. బాడీగార్డ్స్ చేతిలో ఆయుధాలు ఉన్నందువల్ల చాలామంది నివాసితులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలియజేశారు. మరి ఈ విషయం పైన రణవీర్ సింగ్ దంపతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. డైరెక్టర్ ఆదిత్య ధర్ దురంధర్ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో రణవీర్ సింగ్ స్పై ఏజెంట్ గా కనిపిస్తారు. ఈ సినిమా సీక్వెల్ విడుదల కాబోతున్న సందర్భంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి